Chandrabose Naatu Naatu : ఆ పాట కోసం చాలా కష్టపడ్డా
నాటు నాటు సాంగ్ రైటర్
Chandrabose Naatu Naatu : ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నేను రాసిన పాట ఆస్కార్ నామినేషన్ లో చేరడం. ఇది జీవితంలో ఏనాడూ ఊహించని సన్నివేశం. కలలో కూడా తాను అనుకోలేదన్నారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. తెలంగాణ ప్రాంతానికి చెందిన చంద్రబోస్ అంచెలంచెలుగా సినీ పాటల ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
వేటూరి, సిరివెన్నెల, సుద్దాల అశోక్ తేజ తో పాటు చంద్రబోస్ కూడా ప్రముఖుడిగా పేరొందారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీలో చంద్రబోస్ రాసిన పాట దుమ్ము రేపింది. ఊ అంటావా మామ అన్న సాంగ్ దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. తాజాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో చంద్రబోస్ రాసిన పాట నాటు నాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు (Chandrabose Naatu Naatu) పొందింది.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు లభించింది. దీనికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. తాజాగా ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైంది నాటు నాటు సాంగ్. ఈ సందర్భంగా బుధవారం చంద్రబోస్ జాతీయ మీడియాతో మాట్లాడారు. తన ఆనందాన్ని పంచుకున్నారు . ఆస్కార్ అవార్డుల రేసులో తాను రాసిన నాటు నాటు సాంగ్ నిలవడం సంతోసం కలిగిస్తోందని చెప్పారు.
ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ కావడం మరిచి పోలేనని పేర్కొన్నారు చంద్రబోస్. మారుమూల పల్లె నుంచి వచ్చిన తనకు ఇవాళ అంతర్జాతీయ పరంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు రచయిత చంద్రబోస్ .
Also Read : ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ కు నామినేట్