ICC Chief : టెస్టు క్రికెట్ క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఐసీసీ చీఫ్‌

ICC Chief : రోజు రోజుకు టీ20కి ఆద‌ర‌ణ పెరుగుతోంది. రోజుల త‌ర‌బ‌డి ఆడే టెస్టు క్రికెట్ పై నిరాస‌క్త‌త పెరుగుతోంద‌ని ఇది సంప్ర‌దాయ క్రికెట్ కు పెను ప్ర‌మాదమ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ గ్రెగ్ బార్కే హెచ్చ‌రించారు.

ఒక ర‌కంగా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో మ‌రింత గ‌డ్డు కాలం ఎదురు కానుంద‌ని పేర్కొన్నాడు. తాజాగా ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ మ‌ధ్య లార్డ్స్ లో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు హాజ‌ర‌య్యారు బార్క్.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు ఐసీసీ చీఫ్‌(ICC Chief). ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఆయా దేశాల‌లో లీగ్ మ్యాచ్ లు పెరుగుతున్నాయి.

స్థానికంగా వీటికి విప‌రీత‌మైన క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఆయా జట్ల మ‌ధ్య గ‌త కొంత కాలంగా ఆడుతూ వ‌స్తున్న టెస్టు క్రికెట్ మ్యాచ్ ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని అభిప్రాయ ప‌డ్డారు బార్క్.

లీగ్ టోర్నీల వ‌ల్ల ద్వైపాక్షిక సీరీస్ ల‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. టీ20 మ్యాచ్ ల‌ను ఎక్కువ‌గా ప్రేక్ష‌కులు, అభిమానులు ఆద‌రిస్తున్నారు.

ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పున‌కు సంకేత‌మ‌న్నారు. టెక్నాల‌జీలో చోటు చేసుకున్న మార్పులు కూడా ఇందుకు మ‌రో కార‌ణం కావ‌చ్చ‌ని పేర్కొన్నారు బార్క్.

టీ20ల కార‌ణంగా టెస్టు మ్యాచ్ లు నిర్వ‌హించేందుకు ఐసీసీ(ICC Chief) నానా తంటాలు ప‌డాల్సి వ‌స్తోంద‌ని వాపోయారు. అస‌లైన క్రికెట్ అన్న‌ది టెస్టుల ద్వారానే తేలుతుంద‌న్నారు. ఆట‌గాళ్ల లోని ప్ర‌త్యేకత‌లు, ప్ర‌తిభా పాట‌వాలు తెలుస్తాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Also Read : బెంగాల్ టైగ‌ర్ స‌పోర్ట్ మ‌రిచి పోలేను

Leave A Reply

Your Email Id will not be published!