ICC : టీ20 వరల్డ్ కప్ జట్ల ఎంపికకు డెడ్ లైన్
15 సెప్టెంబర్ లో సమర్పించాలన్న ఐసీసీ
ICC : ఈ ఏడాదిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. కాగా ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొనే జట్లు ఉదాసీనంగా ఉన్నాయి.
దీంతో రంగంలోకి దిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)(ICC). ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా దేశాలకు సంబంధించిన క్రికెట్ బోర్డులన్నీ తమ జట్లను ప్రకటించాలని స్పష్టం చేసింది.
15 సెప్టెంబర్ లోగా ఐసీసీకి అందజేయాలని ఆదేశించింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించింది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను అందజేయాలని సూచించింది.
ఊహించని విధంగా ఐసీసీ(ICC) నుంచి ఆదేశాలు రావడంతో బీసీసీఐ అలర్ట్ అయ్యింది. భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఐర్లాండ్ టూర్ కు వెళుతున్నారు.
ఇప్పటికే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సీరీస్ ముగిసింది. ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించారు. మరో వైపు టీమిండియా ఇంగ్లండ్ టూర్ లో ఉంది.
అక్కడ మిగిలి పోయిన ఒక టెస్టుతో పాటు వన్డేలు, టి20లు ఆడనుంది. మొత్తంగా ఐపీఎల్ ముగియడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం.
అయితే ఆటగాళ్ల మధ్యన పోటీ ఎక్కువైంది. ఎవరిని తుది జట్టుకు ఎంపిక చేయాలన్న దానిపై కసరత్తు చేయాల్సిన బాధ్యత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పైనే ఉందని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.
Also Read : ట్విట్టర్ కంటే ఆట ముఖ్యం