ICC ODI Rankings 2022 : ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్ లో కీవీస్ టాప్

4వ స్థానంలో పాక్ ..5వ స్థానంలో భార‌త్

ICC ODI Rankings 2022 : ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా వ‌న్డే ర్యాంకింగ్స్(ICC ODI Rankings 2022) ప్ర‌క‌టించింది. 125 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ అగ్ర‌స్థానంలో నిలిచి స‌త్తా చాటింది. రెండో స్థానంలో కేవ‌లం ఒకే ఒక్క పాయింట్ దూరంలో ఇంగ్లాండ్ మిగిలింది.

ఇక మూడో స్థానంలో 107 పాయింట్లతో ఆస్ట్రేలియా నిలిచింది. ఇక భార‌త జ‌ట్టును వెన‌క్కి నెట్టేసింది దాయాది పాకిస్తాన్. 106 పాయింట్ల‌తో 4వ స్థానానికి చేరుకుంది.

టీమిండియా ఒకే ఒక్క పాయింట్ దూరంలో 105 పాయింట్లు సాధించి 5వ స్థానంతో(ICC ODI Rankings 2022) స‌రిపెట్టుకుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య కేవ‌లం ఒకే ఒక్క పాయింట్ దూరం ఉండ‌డం విశేషం.

స్వ‌దేశంలో వెస్టిండీస్ తో జ‌రిగిన మూడు వ‌న్డేల సీరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది బాబ‌ర్ ఆజ‌మ్ సార‌థ్యంలోని పాకిస్తాన్ జ‌ట్టు. దీంతో ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ ను దాటేసి ముందుకు వెళ్లింది.

మ‌రో వైపు త్వ‌ర‌లోనే టీమిండియా ఇంగ్లాండ్ , వెస్టిండీస్ జ‌ట్ల‌తో వ‌న్డే సీరీస్ లు ఆడ‌నుంది. పాకిస్తాన్ సాధించిన నాలుగో స్థానాన్ని దాట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాక పోవ‌చ్చు మ‌న ఆట‌గాళ్ల‌కు.

ఇక మిగ‌తా జ‌ట్ల విష‌యానికి వ‌స్తే 6వ స్థానంలో 99 పాయింట్ల‌తో ద‌క్షిణాఫ్రికా చేరింది. 95 పాయింట్ల‌తో బంగ్లాదేశ్ 7వ స్థానంలో ఉండ‌గా 87 పాయింట్ల‌తో 8వ ప్లేస్ కు చేరింది.

72 పాయింట్లు సాధించిన విండీస్ 9వ స్థానంలో, సేమ్ పాయింట్స్ సాధించిన ఆఫ్గ‌నిస్తాన్ 10వ ప్లేస్ తో స‌రిపెట్టుకుంది. 11వ స్థానంలో ఐర్లాండ్ , 12వ స్థానంలో స్కాట్లాండ్ , 13వ స్థానంలో యూఏఈ జ‌ట్లు ఉన్నాయి.

14వ స్థానంలో నెద‌ర్లాండ్స్ , 15వ స్థానంలో ఒమ‌న్ , 16వ స్థానంలో జింబాబ్వే , 17వ స్థానంలో యుఎస్ఏ ఉన్నాయి.

Also Read : గెలుస్తారా లేక చేతులెత్తేస్తారా

Leave A Reply

Your Email Id will not be published!