ICC ODI Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings )ను ప్రకటించింది. ఊహించని రీతిలో న్యూజిలాండ్ టాప్ లో నిలిచింది. విచిత్రం ఏమిటంటే సఫారీ గడ్డపై దుమ్ము రేపి వన్డే సీరీస్ గెలుపొందిన బంగ్లా దేశ్ ఈసారి తన ర్యాంకుతో సత్తా చాటడం విశేషం.
ఇక టాప్ లో ఉన్న కీవీస్ కు 121 పాయింట్లు వచ్చాయి. మూడు వన్డేల సీరీస్ లో భాగంగా బంగ్లా కూనలు పులుల్లా విజృంభించారు. తమకు ఎదురే లేదని చాటారు. సఫారీ టీంకు షాక్ ఇచ్చారు.
2 మ్యాచ్ లు గెలుపొంది సీరీస్ కైవసం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ర్యాంకు కాస్తా ముందుకు వచ్చింది. దీంతో వన్డే ర్యాంకింగ్స్(ICC ODI Rankings )లో ఊహించని రీతిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను నెట్టేసింది. ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది.
ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డే లో 88 రన్స్ తేడాతో ఓడి పోయింది పాకిస్తాన్. దీంతో ఆ జట్టు ర్యాంకు ఏడో స్థానానికి పడి పోయింది.
ఇంగ్లండ్ 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 117 పాయింట్లు సాధించి మూడో ప్లేస్ దక్కించుకుంది. ఇక భారత జట్టు 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా 102 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో సరి పెట్టుకుంది.
8వ స్థానంలో 81 పాయింట్లు సాధించి శ్రీలంక చేరితే 9వ స్థానంలో వెస్టిండీస్ 77 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. ఇక ఆఖరున ఆఫ్గనిస్తాన్ 68 పాయింట్లు సాధించి 10వ స్థానంలో నిలిచి పోయింది.
Also Read : సంజూ శాంసన్ సెన్సేషన్