Babar Azam : ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ డిక్లేర్

బాబ‌ర్ ఆజ‌మ్..రాచెల్ ఎంపిక 

Babar Azam  : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ కు సంబంధించి సోమ‌వారం అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌తి నెలా పురుషుల‌, మ‌హిళ‌ల‌కు సంబంధించి అవార్డ్స్ ను ప్ర‌క‌టించింది.

ఈసారి పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam )తో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ హేన్స్ ను ఎంపిక చేసింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని త‌న అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించింది.

అయితే గ‌త నెల మార్చి నెల‌కు గాను ఈ ఇద్ద‌రిని ఎంపిక చేసినట్లు తెలిపింది. గ‌త కొంత కాలం నుంచీ స్ట‌డీగా ఆడుతూ వ‌స్తున్నాడు పాకిస్తాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్. ప్ర‌త్యేకించి స్వ‌దేశంలో ఆసిస్ తో జ‌రిగిన సీరీస్ లో అద్భుతంగా రాణించాడు.

టెస్టుల్లో సెంచ‌రీలు చేశాడు. పాకిస్తాన్ ఓడి పోకుండా డ్రా కావ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. త‌ను ఆడిన ఆట తీరుపై అప్ప‌టి పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి , ఒక‌ప్ప‌టి పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

ఇక రెండో టెస్టులో అయితే ఏకంగా 196 ర‌న్స్ చేశాడు బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam ). ఈ సీరీస్ లో ఒక్క‌డే ఓ సెంచ‌రీతో పాటు రెండు హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. మొత్తం 390 ర‌న్స్ కొట్టాడు.

ఇక పురుషుల మంత్లీ అవార్డు కోసం బాబ‌ర్ ఆజ‌మ్ తో పాటు బ్రాత్ వైట్ , ఆసిస్ సార‌థి పాట్ క‌మిన్స్ పోటీ ప‌డ్డారు. ఇక రాచెల్ విష‌యానికి వ‌స్తే కీవీస్ వేదిక‌గా జ‌రిగిన విమెన్స్ వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌ప్ లో ఆసిస్ త‌ర‌పున అద‌ర‌గొట్టింది.  గ‌త నెల‌లో 429 ర‌న్స్ చేసి స‌త్తా చాటింది.

Also Read : ర‌వీంద్ర జ‌డేజా ఆటపై ఫోక‌స్ పెట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!