ICC T20 World Cup Comment : క్రికెట్ సంబురం యుద్దానికి సిద్దం
మెగా టోర్నీతో వేల కోట్ల వ్యాపారం
ICC T20 World Cup Comment : మరో యద్దం మొదలైంది. ఎలాంటి మిస్సైళ్లు, ఆయుధాలు లేని యుద్దం అది. కోట్లాది మంది ప్రజలను ఒకే చోటుకు చేర్చే సన్నివేశం. నువ్వా నేనా అన్న ఉత్కంఠ భరిత వాతావరణం ఎక్కడా కనిపించదు.
ఒక్క క్రికెట్ లోనే సాధ్యం. ఒకప్పుడు వరల్డ్ వైడ్ గా ఫుట్ బాల్ లో ఉండేది ఈ ఉద్విగ్నభరిత వాతవారణం. కానీ ఇప్పుడు దాని స్థానంలో క్రికెట్ చేరింది.
ఒకప్పుడు ఇది జెంటిల్మెన్ గేమ్. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసిన ఆట. బంతి, బ్యాట్ కు మధ్య జరిగే ఈ కొత్త రకపు వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల కోట్ల రూపాయలతో ముడి పడి ఉన్నది కావడంతో రోజు రోజుకు క్రికెట్ కు(Cricket) మరింత జనాదరణ పెరుగుతోంది.
సంప్రదాయ పరంగా మొదలైన ఈ ఆట ఇప్పుడు ఆధునికతను అందిపుచ్చుకుని కొత్త పోకడలు పోతోంది. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు అంతా క్రికెట్ జపం చేస్తున్నారు. మ్యాచ్ ల సంగతి వదిలి వేస్తే ఒక్కసారి మెగా టోర్నీలు మొదలైతే అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది.
ప్రధానంగా ఐటీ సెక్టార్ కు క్రికెట్ ఫీవర్ తాకింది. తమ సంస్థల్లో పని చేసే వారందరూ రిలాక్స్ కావడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతెందుకు అడిగితే టికెట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.
అంతలా ప్రభావం చూపుతోంది క్రికెట్. ప్రపంచాన్ని టెక్నాలజీ పరంగా శాసిస్తూ వస్తున్న గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కి క్రికెట్ అంటే ఎనలేని పిచ్చి. ఆయన ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా క్రికెట్ మ్యాచ్ లకు అతుక్కు పోతాడు.
దీనిపై ఎందుకంత సమయం కేటాయిస్తన్నారంటూ ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో టెన్షన్ అన్నది తప్పక ఉంటుంది. దాని నుంచి బయట పడాలంటే ఇది ఓ సాధనంగా ఉపయోగ పడతుందంటారు.
ప్రతి దానిలో నెగటివ్ చూసే బదులు క్రికెట్ లో కూడా చెప్పాలంటే లెక్కలేనంత పాజిటివ్ దృక్పథం దాగి ఉందంటారు సిఇఓ. ఇది పక్కన పెడితే
క్రికెటర్ల ఉన్నంత క్రేజ్ ఆయా దేశాలలో ఇంకెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో.
ప్రత్యేకించి ఒకప్పుడు ఇంగ్లాండ్ కే పరిమితమైన క్రికెట్ ఇవాళ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. కానీ ప్రస్తుతం ఎక్కువగా ప్రస్తావించాల్సి ఒకే ఒక్క పేరు అది భారత్.
ఇక్కడ క్రికెట్ అన్నది ఆట కానే కాదు. అది ఓ మతం. దానిని తమ కంటే ఎక్కువగా భావిస్తారు. ప్రేమిస్తారు. భారత్ గెలిస్తే తాము గెలిచినట్లు ఫీలవుతారు. ఓడి పోతే తాము ఓటమి పాలైనట్లు ఆలోచిస్తారు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం.
ఇది పక్కన పెడితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష కోట్ల వ్యాపారం క్రికెట్ చుట్టూ జరుగుతోందంటే నమ్మగలమా. ఇవాళ భారత క్రికెట్ నియంత్రణ
మండలి (బీసీసీఐ) ఆదాయం ప్రపంచంలోనే టాప్ త్రీలో ఉంది.
ఇది అక్షరాల వాస్తవం. రాబోయే రోజుల్లో మొత్తంగా టాప్ లోకి చేరినా ఆశ్చర్య పోక తప్పదేమో. మొన్నటి దాకా క్రికెట్ అంటే దూరంగా ఉన్న అమెరికా
సైతం ఇప్పుడు దాని వైపు చూస్తోందంటే అర్థం క్రికెట్ ఉన్న మజా అలాంటిది.
ఇక్కడ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. దేశం పరువు జాతీయ పతాకంతో ముడి పడి కూడా ఉంటుందని మరిచి పోకూడదు.
తాజాగా ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టి20 వరల్డ్ కప్(ICC T20 World Cup) ప్రారంభం అవుతోంది. మరో సమరానికి 16 జట్లు సిద్దమయ్యాయి.
నెల రోజుల పాటు ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తుంది ఈ టోర్నీ కోసం. అందుకే ఆయుధాలు లేని యుద్దం ఏదైనా ఉందా అంటే అది క్రికెట్ అని
చెప్పక తప్పదు.
Also Read : మేమంతా అన్నదమ్ములం – రోహిత్ శర్మ