Mallikarjun Kharge : ప‌వ‌ర్ లోకి వ‌స్తే ప్ర‌జా పాల‌న – ఖ‌ర్గే

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Mallikarjun Kharge : తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌జా పాల‌న‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). ప్ర‌తి ఇంటికి ఒక ఉద్యోగం, అంద‌రికీ ఉచిత వైద్యం, 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బాలిక‌లంద‌రికీ ఉచితంగా విద్య అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

తాము చేసిన వాగ్ధానాలే రాష్ట్రానికి పునాది అవుతాయ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కుటుంబాల‌కు ఉచిత రూఫింగ్ మెటీరియ‌ల్స్ , 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ , మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఎల్పీజీ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్భంగా మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. వీటిని ఐదు న‌క్ష‌త్రాలుగా పేర్కొంది. ఈ సంద‌ర్భంగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డం. ప‌వ‌ర్ క‌ట్ ఫ్రీ మేఘాల‌య‌గా మారుస్తామ‌ని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్‌. మేఘాల‌యలో 60 అసెంబ్లీ స్థానాల‌కు ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ , బీజేపీ మ‌ధ్య హోరా హూరీ కొన‌సాగుతోంది ప్ర‌చారం. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండ‌నుంద‌ని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఇటీవ‌ల చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మ‌రింత బ‌లాన్ని ఇచ్చింది.

రాహుల్ యాత్ర ఒక ర‌కంగా పార్టీకి ఆక్సిజ‌న్ గా ప‌ని చేసింది. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంలో టాప్ లో నిలిచింద‌ని ఆరోపించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

Also Read : టీఎంసీ అంటే టెర్ర‌ర్..మాఫియా..క‌రప్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!