Arvind Kejriwal : సిసోడియా బీజేపీలో చేరితే కేసులుండవు
సంచలన కామెంట్స్ చేసిన కేజ్రీవాల్
Arvind Kejriwal Sisodia Cases : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఒకవేళ మనీష్ సిసోడియా గనుక భారతీయ జనతా పార్టీలో చేరితే ఆయనపై వేధింపులు, కేసులు, అరెస్ట్ లు(Arvind Kejriwal Sisodia Cases) అంటూ ఉండవని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మనీ లాండరింగ్ కింద సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేసింది ఈడీ.
ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ కు ఇద్దరూ కుడి, ఎడమ భుజం లాంటి వాళ్లు. ఆప్ ఢిల్లీ కేబినెట్ లో 18 శాఖలు నిర్వహించారు సిసోడియా. ఆయన ఆధ్వర్యంలో విద్యా, ఆరోగ్య శాఖలు మంచి పేరు తెచ్చుకున్నాయి. బడులు, మొహల్లా క్లినిక్ లు ఆదర్శ ప్రాయంగా మారడంతో ఆప్ ఎన్నికల్లో వీటినే ముందుకు తీసుకు వచ్చి ప్రచారం చేపట్టింది. అంతే కాదు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆప్ సత్తా చాటింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం సీరియస్ కామెంట్స్ చేశారు.
అవినీతి అన్నది సమస్య కాదు. మంత్రులు చేసిన మంచి పనులను ఆపడమే కేంద్రం ఉద్దేశమని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. సిసోడియా అరెస్ట్ ద్వారా ఆరోగ్యం, విద్యా రంగాలలో తమ ప్రభుత్వ పనిని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటి నుంచి ఆయన స్వేచ్ఛగా బయట తిరుగుతాడంటూ ధ్వజమెత్తారు. ఆప్ పంజాబ్ లో గెలిచిన నాటి నుంచి కేంద్రం మమ్మల్ని టార్గెట్ చేస్తూ వచ్చిందన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).
Also Read : కన్నడ నాట మోదీనే ప్రచార అస్త్రం