Anand Mahindra Fan Ball : ‘ఫ్యాన్ బాల్’ ఉంటే సత్తా చాటే వాళ్లం
ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Anand Mahindra Fan Ball : భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ , సిఇఓ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). ఆయన ఇతర వ్యాపారవేత్తల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆయనకు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి సోమవారం స్పూర్తి దాయకంగా ఉండే అంశాలను ప్రస్తావిస్తారు.
తనకు నచ్చిన విషయాలను పంచుకుంటారు. అభిప్రాయాలను షేర్ చేస్తారు. అంతే కాదు దేశానికి కావాల్సిన వనరులను ఎలా ఉపయోగించు కోవాలో కూడా చెబుతూ ఉంటారు. ఇక ఆనంద్ మహీంద్రా గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయనకు వ్యాపారం కంటే ముందు భారత దేశం అంటే వల్లమాలిన అభిమానం. జాతీయ పతాకం ఎక్కడ ఉన్నా దానిని సగర్వంగా గౌరవించాలని అంటారు.
అంతే కాదు భారత దేశ క్రీడాకారులకు ఆయన చోదకశక్తిగా ఉన్నారంటే నమ్మలేం. ఎందుకంటే ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఆయన ప్రోత్సహిస్తుంటారు. అంతే కాదు తన మహీంద్రా కంపెనీకి చెందిన వాహనాలను బహుమతిగా ఇస్తారు.
తాజాగా ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ -2022 సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణాల గురించి పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు సెమీ ఫైనల్ లో క్రొయేషియాను మట్టి కరిపించింది. 3-0 తేడాతో ఓడించి నేరుగా ఫైనల్ కు చేరింది. ఈ సందర్భంగా అర్జెంటీనాలో పెద్ద ఎత్తున సంబురాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
ఫుట్ బాల్ కోసం కప్ ఉన్నట్టే ఫ్యాన్ బాల్ పేరుతో ఓ కప్ ఉంటే ఎంత బావుండేదని పేర్కొన్నారు. అలా అయితే భారత్ టాప్ లో ఉండేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కేరళలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు .
Also Read : ఫుట్ బాల్ కు లియోనెల్ మెస్సీ గుడ్ బై
Fans of Argentina are celebrating. (Brazilian fans in the crowd too,but obviously they’re not too happy) The interesting thing is that these fans are in India. We may not have shown our merit in Football yet, but if there was a World Cup for ‘Fanball’ we would be in the running… pic.twitter.com/XjVhBHqgpw
— anand mahindra (@anandmahindra) December 14, 2022