Nitish Kumar : కల్తీ మద్యం స్పందించిన సీఎం
39కి చేరిన మృతుల సంఖ్య
Nitish Kumar : కల్తీ మద్యం కారణంగా బీహార్ లో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి రాష్ట్రంలో కొలువు తీరిన మహా ఘట్ బంధన్ సర్కార్ కారణమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. కల్తీ మద్యం కారణంగా చని పోయిన వారి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) .
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యాన్ని నిషేధించామని కానీ వద్దన్నా తాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చని పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు సీఎం. ఇక నుంచి ఎవరూ కల్తీ మద్యాన్ని సేవించ వద్దంటూ కోరారు నితీశ్ కుమార్.
దీని వల్ల తమపై ఆధారపడి ఉన్న కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని ఈ విషయం గుర్తించాలన్నారు. బీహార్ రాష్ట్రం లోని శరన్ జిల్లాలో చాప్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 39 మంది చని పోవడం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజల తరపు నుంచి కూడా మద్దతు ఉండాలని లేక పోతే కష్టమన్నారు. తమ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయని చెప్పారు నితీశ్ కుమార్(Nitish Kumar). పేదలను అరెస్ట్ చేయవద్దని ఆదేశించానని , కానీ కల్తీ మద్యాన్ని తయారు చేసే వాళ్లను మాత్రం వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు సీఎం నితీశ్ కుమార్.
ఇదిలా ఉండగా దీనికి పూర్తి బాధ్యత సీఎం వహించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది.
Also Read : నెహ్రూపై కౌశల్ కిషోర్ షాకింగ్ కామెంట్స్