Kapil Dev : ఆట‌ను ఆస్వాదిస్తే ఒత్తిడి ఉండ‌దు – క‌పిల్ దేవ్

ఐపీఎల్ లో ఒత్తిడి ఉంటే ఆడొద్దని కామెంట్

Kapil Dev : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంతా అంటుంటారు. ప్ర‌ధానంగా ప్రేక్ష‌కుల‌తో పాటు ఆడేవారు కూడా. కానీ తాను దానిని ఒప్పుకోన‌ని పేర్కొన్నారు క‌పిల్ దేవ్.

ఐపీఎల్ తో పాటు ఇత‌ర టోర్న‌మెంట్ ల‌లో కూడా ఒత్తిళ్లు ఎక్కువై పోయాన‌ని వ‌స్తున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు. అలా ఒత్తిళ్ల‌కు గనుక ఎదుర్కొంటే ఐపీఎల్ లో ఆడ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు క‌పిల్ దేవ్(Kapil Dev). దీంతో దిగ్గ‌జ క్రికెట‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి.

ఈ సంద‌ర్భంగా తాను ఆట‌ను ఆస్వాదిస్తాన‌ని అలాంట‌ప్పుడు ఎలాంటి ఒత్తిళ్లంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఆనందం ఉన్న చోట టెన్ష‌న్ అంటూ ఉండ‌ద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా క్రికెట్ రంగంలో ఎప్పుడైతే టి20 ఫార్మాట్ స్టార్ట్ అయ్యిందో ఆనాటి నుంచీ ఆడే ప్ర‌తి ఆట‌గాడు ఏదో ఒక సంద‌ర్భంలో ఒత్తిడికి లోన‌వుతున్నాడు.

ఇది వాస్త‌వం. కానీ క‌పిల్ దేవ్ మాత్రం అలా అయితే ప్లేయ‌ర్ ఎలా అవుతాడంటూ ప్ర‌శ్నించాడు. పూర్తిగా ఆట మీద ఫోక‌స్ పెడితే ఎలాంటి ఇబ్బందులంటూ ఉండ‌వ‌న్నాడు క‌పిల్ దేవ్(Kapil Dev). ప్ర‌స్తుతం ఆట అన్న‌ది పూర్తిగా వ్యాపారాత్మ‌కంగా మారింద‌న్నాడు.

ఆకాష్ బైజూస్ విద్యా సంస్థ నిర్వ‌హించిన ఛాంపియ‌న్స్ ఆఫ్ ఆకాష్ 2022 కార్య‌క్ర‌మానికి క‌పిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. కొంద‌రు మాత్రం ఇదంతా జ‌న‌రేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చింద‌ని పేర్కొంటున్నారు.

Also Read : ఇండియా సౌతాఫ్రికా నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!