Jeff Bezos : ఖర్చు చేస్తే ప్రమాదం దాచుకుంటే లాభం
అమెజాన్ ఫౌండర్..చైర్మన్ బేజోస్ ఉవాచ
Jeff Bezos : ఆర్థిక మాంద్యం మరోసారి భయాందోళనకు కలిగిస్తోంది. కుబేరులు సైతం ముందు వెనుకా ఆలోచిస్తున్నారు. ఇక దిగ్గజ కంపెనీలన్నీ బరువు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు ట్విట్టర్ , గూగుల్, మైక్రో సాఫ్ట్, ఆపిల్ ఉద్యోగులను తొలగించడంలో బిజీగా మారాయి.
వీటి సరసన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ కూడా చేరింది. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్దం, కరోనా ప్రభావం, తదితర కారణాల రీత్యా ఆర్థిక రంగం పూర్తిగా కుంటు పడింది. ఈ తరుణంలో వ్యాపారవేత్తలు ఎలా పొదుపు చేసుకోవాలో సూచిస్తున్నారు.
ఇప్పటికే కరోనా నేర్పిన పాఠం మరోసారి గుర్తు చేసుకోవాలని అంటున్నారు. తాజాగా అమెజాన్ ఫౌండర్, చైర్మన్ జెఫ్ బేజోస్(Jeff Bezos) సంచలన కామెంట్స్ చేశారు. ఇకనైనా ఊరికే ఏవి పడితే అవి కొనుగోలు చేయవద్దని కోరాడు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని దాచు కోవాలని సూచించాడు.
ఇవాళ దాచుకుంటే అవి రేపటికి పనికి వస్తాయని తెలిపాడు. తన జీవిత అనుభవాన్ని మరోసారి ఎంప్లాయిస్ తో పాటు కస్టమర్లకు కూడా హెచ్చరించాడు. ఈ కుబేరుడు ప్రస్తుతం ఎలా దాచుకోవాలనే దానిపై ఉపన్యాసాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. బేజోస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆర్థిక రంగం పరిస్థితి ఎలా ఉందో తెలియ చేస్తుందంటున్నారు టెక్కీ నిపుణులు.
ఏది ఏమైనా పొదుపు అన్నది ముఖ్యం. అది జీవితాన్ని మరింత ఆనందంగా ఎలా గడపాలో నేర్పుతుంది. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : భాగ్యనగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్