Ilayaraja : భారత దేశం గర్వించ దగిన సంగీత శిఖరం ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దిగ్గజ సంగీత దర్శకుడు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.
భారత దేశానికి దిశా నిర్దేశం చేస్తూ భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలల్ని నిజం చేసేందుకు మోదీ యత్నిస్తున్నాడంటూ కితాబు ఇచచారు ఇళయరాజా(Ilayaraja ).
ఆయన ప్రధానిని ఏకంగా అంబేద్కర్ తో పోల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ భారత దేశం కోసం పెద్ద పెద్ద కలలు కన్నారు. ఇద్దరూ ఆచరణాత్మక పురుషులు అంటూ కితాబు ఇచ్చారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ పుస్తకానికి రాసిన ముందు మాటలో ఇళయరాజా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంబేద్కర్ అండ్ మోదీ – రిఫార్మర్్ ఐడియాస్ , పెర్ఫార్మెర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పేరుతో ఈ పుస్తకం వచ్చింది.
దీనిని బ్లూ క్రాస్ డిజిటల ఫౌండేషన్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఈనెల 14న ఆవిష్కరించారు. పబ్లిషర్స్ ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ పుస్తకం అంబేద్కర్ ఆశయాలను ముందుకు ఎలా తీసుకు వెళుతుందనేది దీని ద్వారా తెలియ చేస్తుంది. మోదీ నిర్మిస్తున్న నవ భారతం ఎలా అన్న దానిని కూడా ఈ బుక్ లో పరిచయం చేస్తుందని తెలిపింది.
సంగీత దిగ్గజం ఇళయరాజా మోదీ, అంబేద్కర్ మధ్య కొన్ని అద్భుతమైన పోలికలు ఉన్నాయని ముందు మాటలో చెప్పారు. ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు.
సమాజంలోని సామాజికంగా బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించారని తెలిపారు.
Also Read : 1000 కోట్ల క్లబ్లో చేరిన స్టార్ హీరోలు వీళ్లే