Imran Khan Modi : మోదీని ఆకాశానికి ఎత్తేసిన ఇమ్రాన్ ఖాన్
అక్రమాలకు పాకిస్తాన్ అడ్డాగా మారింది
Imran Khan Modi : మాజీ పాకిస్తాన్ కెప్టెన్, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తన స్వరం పూర్తిగా మార్చేశారు. ప్రస్తుతం ఆయన భారత్ ను పొగిడేందుకే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు.
తాజాగా మరోసారి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని(PM Modi) ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అంతే కాదు భారత్ ను చూసి ప్రస్తుతం పాకిస్తాన్ లో కొలువు తీరిన సర్కార్ నేర్చుకోవాలని సూచించారు.
ఓ వైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నాయకులు పాకిస్తాన్ పై నిప్పులు చెరుగుతున్నారు. మరో వైపు భారత్ పాలన బాగుందంటూ కితాబు ఇచ్చారు మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కూడా మోదీనే ప్రధాన మంత్రి కావాలని కోరారు. అవినీతిలో ప్రస్తుత సర్కార్ కూరుకు పోయిందంటూ ధ్వజమెత్తారు.
మరో వైపు భారత్ లో అన్నీ కంట్రోల్ లో ఉన్నాయని ప్రశంసించారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపంచారు.
పాకిస్తాన్ లో జరిగిన బహిరంగ సభలో ఖాన్ ప్రసంగించారు. ఒక దేశ ప్రధాని విదేశాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెబ్టడం ఇదే మొదటిసారి అని ఎద్దేవా చేశారు. ఆయన ఎంత కూడబెట్టాడనేది ఎవ్వరూ చెప్పలేరన్నారు ఇమ్రాన్ ఖాన్.
మోదీ మాత్రం దేశం కోసం పని చేస్తున్నారని కానీ పాకిస్తాన్ లో ప్రధాన మంత్రులు తమ ఆస్తులను కూడబెట్టుకునే పనిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : యుద్దాన్ని వెంటనే విరమించండి – జై శంకర్