Imran Khan : దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు.
ఆయన రష్యా టుడేతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించ గలిగితే భారత ఉప ఖండం లోని బిలియన్లకు పైగా ప్రజలకు ప్రయోజన కరంగా ఉంటుందని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్. ప్రసార మాధ్యమం ద్వారా తాను భేటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్య పూర్వకంగా కలిసి చర్చించేందుకు తాను సిద్దమై ఉన్నానని మరోసారి తెలిపారు. ఇరు దేశాలు విడి పోయి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
పొద్దస్తమానం యుద్ధం చేయలేమని అన్నారు. ఇప్పటి దాకా మూడు యుద్ధాలు జరిగాయి. కానీ ఇరు దేశాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర లేదన్న వాస్తవం గుర్తించాలన్నారు.
భారత ప్రధాని మోదీతో టీవీలో డిబేట్ చేసేందుకు తాను ఇష్ట పడతానని చెప్పారు. ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ చేస్తున్న పన్నాగాలు, కుట్రలను ఎండగట్టింది భారత్. ఉగ్రవాదం , చర్చలు ఒక దానితో మరొకటి ముందుకు సాగ లేవని పేర్కొంది.
ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా భారత ప్రభుత్వం స్పందించ లేదు. ఇరు దేశాల మధ్య సయోధ్య అవసరం అన్నది అగ్ర దేశాలు కూడా కోరుకుంటున్నాయి.
Also Read : యుద్దానికి సిద్దం గజం భూమి వదులుకోం