Maharashtra Crisis : ముదిరిన సంక్షోభం గౌహతికి చేరిన రాజకీయం
ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే మకాం
Maharashtra Crisis : మరాఠా రాజకీయం మరింత ముదిరింది. ఇప్పటికే కొలువు తీరిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడింది.
నిన్నటి దాకా 21 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారంటూ ప్రకటించారు శివసేన రెబల్ లీడర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే. కానీ ఇవాళ మరో బాంబు పేల్చారు.
ఇండిపెండెంట్లతో పాటు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ ప్రకటించారు. నిన్నటి దాకా గుజరాత్ లోని సూరత్ హోటల్ లో మకాం చేసిన ఏక్ నాథ్ షిండే, ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి అస్సాంలోని గౌహతికి మార్చారు.
దీంతో మరాఠా రాజకీయం(Maharashtra Crisis) ఇప్పుడు గౌహతికి చేరింది. మరో వైపు శివసేన పార్టీ చీఫ్ విప్ గా ఉన్న ఏక్ నాథ్ షిండేను తొలగిస్తున్నట్లు ప్రకటించారు శివసేన చీఫ్, మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే.
133 మంది ఎమ్మెల్యేలు ఉన్న బలగం కాస్తా 111కి చేరింది. దీంతో మహా వికాస్ అఘాడి సంకీర్ణ సర్కార్ బలం మైనార్టీలోకి పడి పోయింది.
ఇదిలా ఉండగా మరాఠాలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను ఢిల్లీకి పిలిపించింది బీజేపీ అధిష్టానం.
దీంతో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి, ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక కచ్చితంగా బీజేపీ ఉందనేది తేలి పోయింది.
నిన్న గుజరాత్ లో ఉన్నారు. ఇవాళ గౌహతికి మారారు. ఈ రెబల్స్ కు పూర్తి అండగా నిలిచారు ప్రస్తుతం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.
Also Read : రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారు – మోదీ