IND vs AUS 1st Test : రాణించిన రోహిత్..జడేజా..పటేల్
144 పరుగుల ఆధిక్యంలో భారత్
IND vs AUS 1st Test : నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యాన్ని చాటుతోంది. ఇప్పటికే బౌలింగ్ పరంగా సత్తా చాటిన బౌలర్లు బ్యాటింగ్ లోనూ ప్రభావం చూపుతున్నారు. ఆసిస్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా 177 పరుగులకే చాప చుట్టేశారు. అనంతరం బరి లోకి దిగిన భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
కేఎల్ రాహుల్ 20 రన్స్ చేస్తే..కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచారు. అయినా ఎక్కడా నిరాశ పడలేదు కెప్టెన్ . 120 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ కూడా రాణించాడు. రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్ లో 9వ సెంచరీ చేస్తే జడేజా, పటేల్ లు చెరో ఫిఫ్టీతో ఆకట్టుకున్నారు.
ఆస్ట్రేలియాపై(IND vs AUS 1st Test) ప్రస్తుతానికి 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. విచిత్రం ఏమిటంటే 8వ వికెట్ కు 81 రన్స్ చేశారు. దీంతో ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 321 రన్స్ చేసింది. ఇంకా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఇంకా మూడు రోజుల ఆట ఆడాల్సి ఉంది.
దీంతో నాగ్ పూర్ లో కచ్చితంగా టెస్టు మ్యాచ్ ఫలితం రానుందని క్రికెట్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా భారత్ తరపున ఆడుతున్న పుజారా 7 , కోహ్లీ 12, సూర్య కుమార్ 8 పరుగులకే పరిమితం అయ్యారు. ఈ పిచ్ పై 300 రన్స్ గనుక చేస్తే ఆసిస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయొచ్చని భావిస్తోంది జట్టు.
Also Read : ఆ ముగ్గురి ఆట అదుర్స్ – సచిన్