IND vs AUS 1st Test : తొలి టెస్టుకు భారత్..ఆసిస్ రె’ఢీ’
నాగపూర్ లో టీమిండియాదే పైచేయి
IND vs AUS 1st Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే ఈ సీరీస్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్, ఆస్ట్రేలియా జట్లపై పడింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా సర్వశక్తులు పెడుతోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది.
రోడ్డు యాక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్ లో ఇద్దరికి కొత్తగా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. నాగపూర్ వేదికగా తొలి టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. ఇక్కడ టీమిండియా 6 టెస్టు మ్యాచ్ లు ఆడితే 4 టెస్టులలో గెలుపొందగా ఒక మ్యాచ్ ఓడి పోయింది.
మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తంగా ట్రాక్ రికార్డు చూస్తే భారత్ కే ఎక్కువగా గెలుపొందేందుకు అవకాశాలు ఉన్నాయి. మరో వైపు పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా(IND vs AUS 1st Test) బలంగా ఉంది. ఆ జట్టును ఎక్కడా తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు.
ఆఖరి క్రికెటర్ వరకు ఏ సమయంలో నైనా పోరాడే సత్తా ఉంది ఆసిస్ కు. వాళ్ల ఆట తీరులో పూర్తిగా ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇక పొట్టి ఫార్మాట్ లో సూపర్ గా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్ లో రాణించ లేక పోయాడు.
ఈసారి టెస్టు సీరీస్ కు ఎంపిక చేశారు. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ తో పాటు పుజారా ఓపెనింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు , మూడు వన్డేలు ఆడుతుంది.
జట్టు పరంగా చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ కాగా విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ , పుజారా , కేఎల్ రాహుల్ , కేఎస్ భరత్, అశ్విన్ , జడేజా , అక్షర్ పటేల్ , షమీ, సిరాజ్ , ఇషాన్ , అయ్యర్ , కుల్దీప్ , సూర్య కుమార్ , జయదేవ్ ఉనాద్కత్ , ఉమేష్ యాదవ్ ఉన్నారు.
Also Read : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా