IND vs AUS Match 2nd Test : బౌలర్ల ధాటికి ఆసిస్ 263 ఆలౌట్
సత్తా చాటిన షమీ..అశ్విన్..జడేజా
IND vs AUS Match 2nd Test : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ప్రారంభమైన రెండో టెస్టు లో తొలి ఇన్నింగ్స్ లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకే చాప చుట్టేసింది. భారత పేసర్ మహ్మద్ షమీ 4 వికెట్లతో రెచ్చి పోతే రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా మరోసారి సత్తా చాటారు. చెరో 3 వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టేశారు. ఇప్పటికే తొలి టెస్టు నాగ్ పూర్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది ఆసిస్. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
ఇది గెలిస్తే మరింత ముందుకు వెళుతుంది. ప్రస్తుతం వరల్డ్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాలో టాప్ 1 లో కొనసాగుతుండగా భారత్ రెండో స్థానంలో ఇంగ్లండ్ మూడో స్థానంతో సరి పెట్టుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టులో(IND vs AUS Match 2nd Test) హ్యాండ్స్ కాంబ్ అద్భుతంగా ఆడాడు. చివరి దాకా ఉన్నాడు. 72 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మూడో సెషన్ లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్ లో పాట్ కమిన్స్ తో పాటు మర్ఫీని బోల్తా కొట్టించాడు.
అనంతరం షమీ లయాన్ , కుహ్నే ను బౌల్డ్ చేశాడు. మరో ఆసిస్ స్టార్ హిట్టర్ ఉస్మాన్ ఖవాజా భారత బౌలర్లను గట్టిగా ఎదుర్కొన్నాడు. 81 రన్స్ చేసి జట్టు స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా తొలి టెస్టులో విఫలమైన సూర్య కుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంది జట్టు యాజమాన్యం. ప్రస్తుతం భారత జట్టు మైదానంలోకి దిగింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 18 రన్స్ చేసింది.
Also Read : చచ్చేంత దాకా దాదానే నా హీరో