IND vs AUS 2nd Test 2023 : రెండో టెస్టుకు భారత్ ఆసిస్ రెడీ
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో
IND vs AUS 2nd Test 2023 : భారత, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య కీలకమైన రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా అరుణ్ జైట్లీ మైదానంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
అయినా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే భారత జట్టు(IND vs AUS 2nd Test 2023) ఇంకా కష్ట పడాల్సి ఉంటుంది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపారు. ఇన్నింగ్స్ తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది భారత్.
టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో 177 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు సరిగ్గా 400 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ఆసిస్ 93 పరుగులకే చాప చుట్టేసింది.
తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ , షమీ, సిరాజ్ సత్తా చాటారు. రెండో ఇన్నింగ్స్ లోనూ హవా కొనసాగింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేస్తే , జడేజా, షమీ దుమ్ము రేపారు. ఇక ఫుల్ జోష్ మీద ఉంది భారత జట్టు.
ఇప్పటికే జట్టులో కీలక మార్పులు ఏవీ ఉండవని ప్రకటించాడు భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్ గా ఉంటే పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. కానీ ఫైనల్ జట్టును ఇంకా ప్రకటించ లేదని తెలిపాడు. ఇదిలా ఉండగా పాత జట్టునే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది.
Also Read : శ్రేయస్ అయ్యర్ పై ద్రవిడ్ కామెంట్స్