IND vs AUS Win 2nd Test : రెండో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ
6 వికెట్ల తేడాతో ఆసిస్ విజయం
IND vs AUS Win 2nd Test Win : ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు(IND vs AUS 2nd Test Win) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్పటికే నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన టీమిండియా బలమైన ఆసిస్ ను రెండో టెస్టులోనూ మట్టి కరిపించింది.
ప్రధానంగా భారత జట్టు స్పిన్నర్ల ధాటికి ఆసిస్ బ్యాటర్లు విల విల లాడి పోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 115 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 118 రన్స్ చేసింది. దీంతో 2-0 తేడాతో లీడ్ లో కొనసాగుతోంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే చాప చుట్టేసింది.
అనంతరం భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 262 రన్స్ చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత్ తీవ్రంగా శ్రమించింది. కీలకమైన వికెట్లను చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు సైతం తక్కువ స్కోర్ కే పరిమితయ్యారు.
అనంతరం లక్ష్యాన్ని దగ్గరుండి చేరుకునేలా ఆడాడు ఛతేశ్వర్ పుజారా. అతడి కెరీర్ లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. చివరి వరకు ఉన్నాడు. 31 విలువైన పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు. ఇదిలా ఉండగా ఆసిస్ పతనాన్ని శాసించారు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ . జడ్డూ ఏకంగా 7 వికెట్లు తీస్తే అశ్విన్ 3 వికెట్లు కూల్చాడు.
Also Read : సచిన్ రికార్డ్ విరాట్ కోహ్లీ బ్రేక్