IND vs AUS 2nd ODI : ఆసిస్ దెబ్బకు భారత్ విలవిల
118 రన్స్ ఆస్ట్రేలియా టార్గెట్
IND vs AUS 2ndODI : మూడు వన్డే సీరీస్ లో భాగంగా విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైదానంలో జరిగిన రెండో వన్డే లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆస్ట్రేలియా ధాటికి 117 పరుగులకే చాప చుట్టేసింది.
టాప్ ఆర్డర్ ఎవరూ కూడా ఆసిస్ బౌలర్ల దెబ్బకు నిలువలేక పోయారు. రన్స్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. 50 ఓవర్లు ఆడాల్సి ఉండగా టీమిండియా(IND vs AUS 2ndODI) కేవలం 26 ఓవర్లకే తల వంచింది. కేవలం తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది.
మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్షర్ పటేల్ , విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్లు గా నిలిచారు. 29 రన్స్ పటేల్ చేశాడు. చివరగా వచ్చిన బౌలర్ హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సున్నాకే వెనుదిరిగాడు.
ఇక ఓ వైపు వికెట్లు రాలుతున్నా రన్స్ చేసేందుకు ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. ఆసిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 31 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. జట్టులోని నలుగురు బ్యాటర్లు ఖాతా కూడా ఓపెన్ చేయలేక పోయారు.
కెప్టెన్ రోహిత్ శర్మ 13 రన్స్ చేస్తే రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు. శుభ్ మన్ గిల్ , సూర్య కుమార్ యాదవ్ సున్నాకే వెను దిరిగారు. ఇక కేఎల్ రాహుల్ 9 రన్స్ చేస్తే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1 పరుగు చేసి నిరాశ పరిచాడు.
కుల్దీప్ యాదవ్ 4 రన్స్ చేస్తే , సిరాజ్, షమీ సున్నాకే చాప చుట్టేశారు. ఇక ఆసిస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బంతులతో నిప్పులు చెరిగాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. అబాట్ 3 వికెట్లు తీస్తే ఎల్లీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read : బీసీసీఐ అత్యంత శక్తివంతమైంది