IND vs AUS 4th Test : చెలరేగిన ఖవాజా..కామెరాన్
ఆస్ట్రేలియా 480 రన్స్ కు ఆలౌట్
IND vs AUS Day 2 4th Test : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరిదైన 4వ టెస్టులో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. మరోసారి రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా మారాడు. ఇక నిన్నటి సెంచరీతో ఇవాళ ప్రారంభించిన ఉస్మాన్ ఖవాజా 180 రన్స్ చేసి దుమ్ము రేపాడు. జట్టు భారీ స్కోర్ లో సహకారం అందించాడు. మరో వైపు కామెరాన్ ఏకంగా ఖవాజా తో కలిసి 114 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి వికెట్ పోకుండా 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఐదో వికెట్ కు.
మంచి ఊపు మీదున్న ఇద్దరిలో కామెరూన్ ను అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు రవిచంద్రన్ అశ్విన్ . మరో ఆటగాడు అలెక్స్ కారీ కూడా తన వికెట్ ను పారేసుకున్నాడు. 14వ సెంచరీతో చెలరేగాడు ఉస్మాన్ ఖవాజా. గ్రీన్ కామెరాన్ తన తొలి శతకం చేశాడు. తొలి రోజు నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆరు వికెట్లు కోల్పోయింది.
విచిత్రం ఏమిటంటే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను పదే పదే పలుమార్లు మార్చినా ఫలితం లేక పోయింది. అహ్మదాబాద్ స్టేడియంలో ఆసిస్ పరుగుల వరద పారించింది.
ఇక నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటి వరకు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది భారత జట్టు(IND vs AUS Day 2 4th Test). నాగ్ పూర్ , ఢిల్లీలో భారత్ గెలుపొందగా ఇండోర్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఇక భారత జట్టులో రోహిత్ శర్మ , గిల్ , పుజారా, కోహ్లీ, అయ్యర్ , భరత్ , జడేజా , పటేల్ , అశ్విన్ ,షమీ , ఉమేష్ యాదవ్ ఆడుతున్నారు.
Also Read : జెమీమా రోడ్రిగ్స్ స్టన్నింగ్ క్యాచ్