IND vs AUS ICC ODI World Cup : ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జగజ్జేత
భారీ తేడాతో భారత్ పై విక్టరీ
IND vs AUS ICC ODI World Cup : అహ్మదాబాద్ – కోట్లాది భారతీయుల ఆశలను వమ్ము చేస్తూ వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచింది బలమైన ఆస్ట్రేలియా. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని ఆసిస్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. నువ్వా నేనా సాగుతుందని అనుకున్న ఫైనల్ మ్యాచ్ ఒకరకంగా చెప్పాలంటే ఏకపక్షంగా సాగింది.
IND vs AUS ICC ODI World Cup Status
గుజరాత్ లోని అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో లక్షా 30 వేల మంది సాక్షిగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ఎగరేసుకు పోయింది ఆసిస్. టోర్నీలో వరుస విజయాలతో ఎదురే లేకుండా చేసుకుంటూ వచ్చిన రోహిత్ సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఆసిస్ స్కిప్పర్ టాస్ గెలిచాడు. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వచ్చీ రాగానే భారత జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించారు. అద్భుతమైన బౌలింగ్ తో పాటు కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ చేసింది ఆసిస్.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 47 రన్స్ చేస్తే మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ఇక కేఎల్ రాహుల్ వికెట్ల వద్ద పాతుకు పోయినా ఆశించిన మేర వేగంగా పరుగులు చేయలేక పోయాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ , శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ లు తీవ్ర నిరాశ పరిచారు.
అనంతరం 241 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే వార్నర్ , మార్ష్ వికెట్లను కోల్పోయింది. దీంతో భారత జట్టులో, స్టేడియంలో ఆశలు మొలకెత్తాయి. కానీ లబూషేన్ , హేడ్ భారత జట్టుకు అడ్డంకిగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ట్రావిస్ హేడ్ 137 రన్స్ తో రెచ్చి పోయాడు. చివరలో అవుట్ అయ్యాడు. లబూషేన్ 58 రన్స్ తో నిలిచాడు. ఇద్దరూ కలిసి తమ దేశానికి అరుదైన కానుకను వరల్డ్ కప్ రూపంలో అందజేశారు.
ఆఖరున విన్నింగ్ రన్స్ కొట్టాడు గ్లెన్ మ్యాక్స్ వెల్.
Also Read : IND vs AUS ICC ODI World Cup : ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జగజ్జేత