IND vs AUS World Cup 2023 : భారత్ చేతిలో ఆసిస్ చిత్తు
విరాట్ కోహ్లీ..కేఎల్ రాహుల్ కమాల్
IND vs AUS World Cup 2023 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ఆస్ట్రేలియాను ఖంగు తినిపించింది. 50 ఓవర్ల మ్యాచ్ లో ఇంకా ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
IND vs AUS World Cup 2023 Updates
ఒకానొక దశలో కేవలం 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఆదుకున్నారు. జట్టును ఓడి పోకుండా కాపాడారు. అడ్డు గోడలా నిలబడ్డారు. ఎక్కడా తడబడకుండా మెల మెల్లగా సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
చివరి దాకా ఉంటాడని భావించిన విరాట్ కోహ్లీ ఉన్నట్టుండి 85 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సహకారంతో కేఎల్ రాహుల్ రెచ్చి పోయాడు. 97 రన్స్ చేసి ఔరా అనిపించాడు.
జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి, మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్(KL Rahul) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 200 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు ప్రత్యర్థి జట్టును.
Also Read : Home Minister Slaps Comment : మంత్రినా మజాకా