IND vs ENG 5th Test : ఉత్కంఠ పోరుకు భారత్ ఇంగ్లండ్ రెడీ
నేడే రీషెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ కు రెడీ
IND vs ENG 5th Test : కరోనా కారణంగా వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ కు గాను భారత జట్టు 2-1 తేడాతో ఇంగ్లండ్ పై ఆధిక్యంలో ఉంది.
కానీ ఈసారి ఇంగ్లండ్ మంచి ఊపు మీదుంది. పోప్ , బెన్ స్టోక్స్ తదితర ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇక భారత జట్టు(IND vs ENG 5th Test) ఎన్నడూ లేని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రధానంగా రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్
గాయం కారణంగా ఆడడం లేదు.
దీంతో ఇప్పుడు స్టార్ హిట్టర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ తో పలువురు ఆటగాళ్లకు అగ్ని పరీక్ష కానుంది ఈ టెస్టు మ్యాచ్. ఇంగ్లాండ్(IND vs ENG 5th Test) ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సీరీస్ సమం చేయాలని చూస్తోంది.
ఇప్పటికే ఆ జట్టు స్వదేశంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ కు చుక్కలు చూపించింది. ఏకంగా మూడు టెస్టుల సీరీస్ ను
కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది.
ఆనాడు కరోనా ఉందనే సాకుతో భారత జట్టు ఆటగాళ్లు చివరి టెస్టును ఆడకుండా దుబాయిలో జరిగిన ఐపీఎల్ లో ఆడేందుకు వెళ్లారు. పెద్ద
రాద్దాంతమే కొనసాగింది.
ఈసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో బీసీసీఐ ఐదో టెస్టును రీ షెడ్యూల్ చేసింది. భారత జట్టు రీ షెడ్యూల్ టెస్టుతో పాటు వన్డేలు, టి20లు ఆడనుంది.
ఇక భారత జట్టుకు బుమ్రా కెప్టెన్ కాగా పంత్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ జట్టుకు కెప్టెన్ కావడం ఇది రెండోసారి.
Also Read : వన్డే..టి20 జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్