IND vs ENG 3rd ODI : ఇంగ్లండ్ పై విజయం వన్డే సీరీస్ కైవసం
కదం తొక్కిన పంత్ చెలరేగిన పాండ్యా
IND vs ENG 3rd ODI : నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన మూడో కీలక వన్డే మ్యాచ్ లో ఎట్టకేలకు భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మొదటి వన్డేలో టీమిండియా ఇంగ్లండ్ ను 10 వికెట్ల తేడాతో ఓడించి విక్టరీ సాధించింది. ఇక రెండో వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా భారత్ ను 100 రన్స్
తేడాతో అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.
ఈ తరుణంలో సీరీస్ ను ప్రభావితం చేసే కీలకమైన మ్యాచ్ లో సత్తా చాటింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు(IND vs ENG 3rd ODI) 259 పరుగులు చేసి ఆలౌటైంది.
హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ తో కట్టడి చేశారు. అనంతరం 260 పరుగుల భారీ స్కోర్ ను ఛేదించేందుకు బరిలోకి
దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
టాప్లే బౌలింగ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ బాగా ఆడతాడని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే
మిగిలింది. రోహిత్ శర్మ 17 పరుగులు చేసి అవుట్ కాగా వరుసగా వైఫల్యం చెందుతూ వస్తున్న విరాట్ కోహ్లీ కూడా 17 రన్స్ చేసి వెనుదిరిగారు.
అనంతరం బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ కూడా ఆకట్టు కోలేక పోయాడు. కేవలం 16 రన్స్ మాత్రమే చేశాడు. ఈ తరుణంలో స్టార్ ప్లేయర్లు
రిషబ్ పంత్ , పాండ్యా దంచి కొట్టారు.
పాండ్యా 71 పరుగులు చేసి సత్తా చాటగా పంత్ 125 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3 వికెట్లు తీస్తే ఓవర్టాన్ ,
కార్సే చెరో వికెట్ తీశారు.
Also Read : సేమ్ సీన్ విరాట్ కోహ్లీ పరేషాన్