IND vs ENG 2nd T20 : భారత్, ఇంగ్లాండ్ రెండవ టెస్ట్ లో భారత్ ఘన విజయం
తొలి ఓవర్‌లోనే ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేశాడు...
IND vs ENG : చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్కోర్ 165/9 కాగా, భారత్ స్కోర్ 166/8. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 భారత్ ఆధిక్యం. తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బట్లర్ 45, కార్సే 31 పరుగులు చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ టార్గెట్‌ను భారత్.. 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.
IND vs ENG 2nd T20 Match Updates
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగిన ఇంగ్లాండ్‌కు అర్షదీప్ సింగ్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేశాడు. మరో ఓపెనర్ బెన్ డకెటన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ దశలో కెప్టెన్ జోస్ బట్లర్ (45) నిలబడ్డాడు. ఇతర బ్యాటర్ల సాయంతో స్కోరు బోర్డును 150 పరుగుల మార్కును దాటించాడు.
Also Read : TG Govt : మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్