IND vs ENG 5th Test : పంత్ పరాక్రమం భారత్ పటిష్టం
చెలరేగిన రిషబ్..రవీంద్ర జడేజా
IND vs ENG 5th Test : స్వదేశంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలిచిన న్యూజిలాండ్ కు చుక్కలు చూపించి క్లీన్ స్వీప్ చేసి సీరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించింది భారత జట్టు(IND vs ENG 5th Test).
రీ షెడ్యూల్ ఐదో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ షాన్ దార్ సెంచరీతో చెలరేగితే రవీంద్ర జడేజా తనదైన శైలిలో దుమ్ము రేపాడు. వీరిద్దరూ కలిసి పరుగులు పెట్టించారు.
ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అండర్సన్ దెబ్బకు మొదట్లోనే ఓపెనర్ శుభ్ మన్ గిల్ పెవీలిన్ దారి పట్టాడు.
ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ బౌల్డ్ కావడంతో ఇక్కట్ల పాలైంది. కేవలం 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో రిషబ్ పంత్, జడేజా జట్టును ఒడ్డున పడేసేందుకు యత్నించారు.
అద్భుతమైన షాట్లతో అలరించారు. టెస్టులో తన ఐదో సెంచరీని నమోదు చేశాడు పంత్. మొత్తం 111 బంతులు ఆడి 146 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
ఇక రవీంద్ర జడేజా 163 బంతులు ఆడి 10 ఫోర్లతో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 73 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 338 రన్స్ చేసింది.
సచిన్ టెండూల్కర్ , ఇయాన్ బిషప్ పంత్ ఆడిన తీరును, జడేజా ఇన్నింగ్స్ ను ఆకాశానికి ఎత్తేశారు. వీరితో పాటు హర్భజన్ సింగ్ , రైనా, పఠాన్ కూడా ప్రశంసించారు.
Also Read : శాంసన్ రాణించినా ఒక్క మ్యాచేనా
Rishabh Pant, you beauty! 🤩💯
Is there a more exciting Test cricketer in the modern game?! 🔥
Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) – (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z
— Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022