IND vs IRE 1st T20 : ఐర్లాండ్ తో టీమిండియా టి20

ఆడే అవకాశం ఎవ‌రికి ద‌క్కేనో

IND vs IRE 1st T20 : ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే ఆరుగురు కెప్టెన్ల‌ను మార్చింది.

ఐపీఎల్ లో స‌త్తా చాటడ‌మే కాదు ఏకంగా తొలిసారిగా గుజ‌రాత్ టైటాన్స్ కు క‌ప్పు ను అందంచిన ఆ జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యాకు ప్ర‌మోష‌న్ ఇచ్చింది.

ఏకంగా ఐర్లాండ్ తో జ‌రిగే టి20 సీరీస్ కు యువ ర‌క్తంతో నిండిన భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా నియ‌మించింది. ఈ సీరీస్ కు భార‌త క్రికెట్ అకాడమీ చైర్మ‌న్ గా ఉన్న వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ను కోచ్ గా నియ‌మించింది.

ఆయ‌న‌కు స‌హాయ‌కుడిగా సాయిరాజ్ బ‌హుతులే ను ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే జ‌ట్టు అక్క‌డికి చేరుకుంది. ఇవాళ కీల‌క‌మైన మొద‌టి టి20 మ్యాచ్ ఆడ‌నుంది.

మైదానంలో భార‌త ఆట‌గాళ్లు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేశారు. ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇరు జ‌ట్ల ప‌రంగా చూస్తే భార‌త్(IND vs IRE 1st T20)  దే పైచేయిగా క‌నిపిస్తోంది.

కానీ మైదానంలో దిగితే కానీ ఏ జ‌ట్టు బ‌లంగా ఉంటుందో చెప్ప‌లేం. స్వంత గ‌డ్డ‌పై స‌త్తా చాటాల‌ని చూస్తోంది ఐర్లాండ్ టీం. పేస‌ర్లు ఆర్ష్ దీప్ , ఉమ్రాన్ మాలిక్ లు ఆడే చాన్స్ ఉంది.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం సంజూ శాంస‌న్ ను తీసుకోవాల‌ని ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మాజీ కోచ్ ర‌విశాస్త్రి సూచించాడు. ఇక ప్ర‌ధాన ఆట‌గాళ్లు రిష‌బ్ పంత్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ లు లేక పోవ‌డంతో బ్యాటింగ్ ప‌రంగా శాంస‌న్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది భార‌త జ‌ట్టు.

ఇక భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ కూడా ఐర్లాండ్ వెళ్లాడు.

Also Read : రెండో టి20లో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!