IND vs IRE 2nd T20 : టీమిండియా జోరు ఐర్లాండ్ బేజారు
రెండో టి20 కీలక మ్యాచ్ నేడే
IND vs IRE 2nd T20 : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు జోరు మీదుంది. టి20 సీరీస్ లో భాగంగా ఐర్లాండ్(IND vs IRE 2nd T20) లో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటికే మొదటి టి20 గెలిచి రెండో మ్యాచ్ కోసం వేచి చూస్తోంది.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలంగా ఉంది భారత జట్టు. ఈ మ్యాచ్ ను కూడా పూర్తి చేసి సీరీస్ గెలుచు కోవాలని ఉవ్విళ్లూరుతోంది. మొదటి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారడంతో కేవలం 12 ఓవర్లకే కుదించారు.
అయినా భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గతంలో జరిగిన మ్యాచ్ లలో సైతం టీమిండియాదే పై చేయిగా ఉంది. ఒకవేళ వర్షం కురిసి కొద్దిగా తగ్గితే బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత్(IND vs IRE 2nd T20) బౌలర్లు ఊపు మీదున్నారు. సేమ్ టీమ్ ను కొనసాగించాలని నిర్ణయించినా ప్రస్తుతానికి రుతురాజ్ గైక్వాడ్ గాయంతో రెండో మ్యాచ్ కు దూరమయ్యాడు.
అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠిని లేదా స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ ను తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్ మేనేజ్ మెంట్. మారథన్ ఎక్స్ ప్రెస్ పేసర్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ కు కేవలం ఒకే ఒక్క ఓవర్ చాన్స్ దక్కింది.
ఇక భువనేశ్వర్ కుమార్ , యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి బౌలింగ్ లో పరుగులు తీయడం కష్టంగా మారింది. మిగతా బౌలర్లు సైతం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇక బ్యాటర్ల పరంగా ఇషాన్ కిషన్ , పాండ్యా, దినేష్ కార్తీక్ ఉండనే ఉన్నారు. ఏది ఏమైనా ఈ టూర్ పాండ్యాకు తీపి గుర్తుగా ఉండి పోతుంది.
Also Read : మూడో టి20లో శ్రీలంక గ్రాండ్ విక్టరీ