IND vs IRE 2nd T20 : ఐర్లాండ్ ప‌రాజ‌యం భార‌త్ సీరీస్ కైవ‌సం

ఉత్కంఠ భ‌రిత పోరులో 4 ర‌న్స్ తేడాతో విక్ట‌రీ

IND vs IRE 2nd T20 : మొదటిసారిగా అంత‌ర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా ప‌దోన్న‌తి పొందిన హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఐర్లాండ్ లోని డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టి20(IND vs IRE 2nd T20) మ్యాచ్ ఆద్యంతం ఉత్కంట భ‌రితంగా సాగింది.

చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతూ వ‌చ్చింది. కానీ చివ‌రకు టీమిండియానే విజ‌యం వ‌రించేలా చేసింది. ఆతిథ్య ఐర్లాండ్ సైతం గ‌ట్టి పోటీ ఇచ్చింది.

భార‌త బౌల‌ర్లు స‌త్తా చాట‌డంతో గెలుపు సుల‌భ‌మైంది. 4 ప‌రుగుల తేడాతో ఓడించి 2-0 సీరీస్ కైవ‌సం చేసుకుంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అంచ‌నాల‌కు మించి ఆట‌గాళ్లు రాణించారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 225 ర‌న్స్ చేసింది. దీపక్ హూడా రెచ్చి పోయాడు. 57 బంతులు ఎదుర్కొని 104 ర‌న్స్ చేశాడు.

ఇందులో 9 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ దుమ్ము రేపాడు. 42 బంతులు ఎదుర్కొని 77 ర‌న్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి.

అనంత‌రం 226 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ ఆఖ‌రు వ‌ర‌కు పోరాడింది. 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 221 ర‌న్స్ చేసింది. ఆండీ బ‌ల్బర్కీ దుమ్ము రేపాడు.

37 బంతులు ఆడి 3 ఫోర్లు 7 సిక్స‌ర్లతో రెచ్చి పోయాడు. 60 ప‌రుగులు చేశాడు. పాల్ స్టీరింగ్ 18 బంతులు ఆడి 5 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 40 ర‌న్స్ చేశాడు.

హ్యారీ టెక్ట‌ర్ 5 ఫోర్ల‌తో 30 ర‌న్స్ చేస్తే డాక్ రెల్ 16 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్స్ ల‌తో రెచ్చి పోయాడు. 34 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : దంచి కొట్టిన హుడా రెచ్చి పోయిన శాంస‌న్

Leave A Reply

Your Email Id will not be published!