Pant VS Samson : రెండో వన్డేలో పంత్ వర్సెస్ శాంసన్
ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్
Pant VS Samson : న్యూజిలాండ్ టూర్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు వన్డే సీరీస్ లో భాగంగా రెండో వన్డే ఆడనుంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అంతకు ముందు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు టి20 సీరీస్ చేజిక్కించుకుంది.
అయితే భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. లక్ష్యం భారీగా ఉన్నా , కీవీస్ మొదట్లోనే మూడు వికెట్లు త్వరత్వరగా కోల్పోయినా ఎక్కడా తొట్రుపాటుకు లోను కాకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో పాటు మరో ఓపెనర్ దుమ్ము రేపాడు. అద్భుతంగా ఆడారు.
ఒక రకంగా చెప్పాలంటే భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. మొత్తం టార్గెట్ ను ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ పూర్తి చేశారు. దీంతో బ్యాటర్లు బాగానే ఆడినా బౌలర్ల కారణంగా భారత్ చేతులెత్తేసింది. విచిత్రం ఏమిటంటే కేరళ స్టార్ సంజూ శాంసన్ అద్బుతంగా ఆడుతున్నా పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో గత్యంతరం లేక తీసుకున్నారు. శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సంజూ శాంసన్ , వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు. ఇక ఎప్పటి లాగానే రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. ఆడతాడని అనుకున్న సూర్య కుమార్ నిరాశ పరిచాడు. దీంతో ఇద్దరు వికెట్ కీపర్లు పంత్ , శాంసన్ లలో(Pant VS Samson) ఎవరినో ఒకరిని తీసుకోనున్నారు.
మొత్తంగా చూస్తే జట్టు ఇలా ఉండవచ్చు. ధావన్ , గిల్ , యాదవ్ , పంత్ లేదా శాంసన్ , హూడా, సుందర్ , ఠాకూర్ , మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ , చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ .
Also Read : మాతో ఆడక పోతే వరల్డ్ కప్ కు దూరం