IND vs NZ 3rd T20 : టీమిండియాదే టి20 సీరీస్
టై గా ముగిసిన మూడో మ్యాచ్
IND vs NZ 3rd T20 : భారత, న్యూజిలాండ్ మధ్య జరిగిన కీలకమైన మూడో టి20 మ్యాచ్ లో 1-0 తేడాతో టీమిండియా(IND vs NZ 3rd T20) సీరీస్ కైవసం చేసుకుంది. మొదట కీవీస్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే వికెట్లను కోల్పోయింది.
4 కీలక వికెట్లను కోల్పోయి 75 పరుగులు చేసింది. ఈ తరుణంలో మరోసారి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో కొద్ది సేపు మ్యాచ్ ను నిలిపి వేశారు అంపైర్లు. అయినా వాన ఆగక పోవడంతో భారత్ టార్గెట్ ను 9 ఓవర్లలో 76 రన్స్ చేశారు. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై గా ముగిసినట్లు ప్రకటించక తప్పలేదు.
దీంతో ఇప్పటికే మొదటి మ్యాచ్ ను 65 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఒక మ్యాచ్ గెలుపుతో టి20 సీరీస్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టుకు సీరీస్ దక్కింది. మరో వైపు కోచ్ లక్ష్మన్ , కెప్టెన్ అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ , రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచారు.
కిషన్ 10 రన్స్ చేస్తే రిషబ్ పంత్ 11 పరుగులే చేశారు. అనంతరం రెండో టి20లో సెంచరీతో కదం తొక్కిన సూర్య కుమార్ యాదవ్ కేవలం 13 రన్స్ కే పెవిలియన్ దారి పట్టాడు. మొత్తంగా నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. కీవీస్ బౌలర్లలో సౌథీ రెండు , మిల్నే , సోది చెరో వికెట్ తీశారు. మరోసారి సంజూ శాంసన్ కు నిరాశే మిగిలింది.
Also Read : సెలెక్టర్ల తొలగింపుపై కార్తీక్ కామెంట్స్