IND vs PAK : 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన పాక్..ప్రెషర్ లో పాక్ ఆటగాళ్లు

స్వల్ప గాయం కారణంగా కాసేపు మైదానాన్ని వీడి బయటకు వెళ్లాడు...

IND vs PAK : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్(IND vs PAK) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్లో పిచ్‌పై పాకిస్తాన్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారు. కాస్త దూకుడు పెంచి బౌండరీలు కొడుతున్న పాక్ ఓపెనర్ బాబర్ అజామ్ (23)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (25 బంతుల్లో 10) రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది.

IND vs PAK Match Updates

బౌలింగ్ ప్రారంభించిన పేసర్ మహ్మద్ షమీ కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించాడు. స్వల్ప గాయం కారణంగా కాసేపు మైదానాన్ని వీడి బయటకు వెళ్లాడు. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్, షౌద్ షకీల్ క్రీజులో ఉన్నారు. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నారు. ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగింది.పాకిస్తాన్ మాత్రం గత మ్యాచ్‌తో పోల్చుకుంటే ఓ మార్పుతో బరిలోకి దిగింది.

Also Read : Minister Ram Mohan Naidu : వైసీపీ శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్ర చేస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!