IND vs SA 3rd T20 : గెలుస్తారా లేక చేతులెత్తేస్తారా

భార‌త్, సౌతాఫ్రికా మూడో టి20

IND vs SA 3rd T20 : భార‌త‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య కీల‌క మూడో టీ20 మ్యాచ్(IND vs SA 3rd T20) జ‌ర‌గ‌నుంది ఇవాళ‌. ఏపీలోని విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా జ‌రిగే ఈ కీల‌క మ్యాచ్ భార‌త జ‌ట్టుకు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.

ఇప్ప‌టికే ఢిల్లీ వేదికగా జ‌రిగిన మొద‌టి టి20 మ్యాచ్ తో పాటు క‌ట‌క్ లో జ‌రిగిన 2వ టి20 మ్యాచ్ కూడా సౌతాఫ్రికా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో టీమిండియా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌, ఆట తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మొద‌టి మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా బౌల‌ర్ల పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్ కోల్పోయింది. ప్ర‌ధానంగా కిల్ల‌ర్ మిల్ల‌ర్, డ‌స్సెన్ దుమ్ము రేపారు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో రెండో మ్యాచ్ లో బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. అయ్య‌ర్, కిష‌న్ , దినేష్ కార్తీక్ మాత్ర‌మే రాణించారు. చెత్త షాట్ కు వెళ్లి పంత్

పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు.

ఈ త‌రుణంలో ఈ మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే రెండు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై

టీమిండియా(IND vs SA 3rd T20) ఒత్తిళ్ల‌లో ఉండ‌గా వ‌రుస విక్ట‌రీల‌తో స‌ఫారీ టీం ఫుల్ జోష్ మీద ఉంది.

ఎలాగైనా మూడో మ్యాచ్ గెలిచి సీరీస్ చేజిక్కించు కోవాల‌ని చూస్తోంది. రెండో మ్యాచ్ లో బౌలింగ్ కాస్త మెరుగు ప‌డింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్

అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

అవేష్ ఖాన్ అంత‌గా ఆక‌ట్టు కోలేదు. హ‌ర్ష‌ల్ పొదుపుగా బౌలింగ్ చేయ‌డం అడ్వాంటేజ్.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే పంత్ కెప్టెన్ . పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ , ఇషాన్ , దీప‌క్ హూడా, అయ్య‌ర్ , దినేష్ కార్తీక్ , వెంక‌టేశ్ , యుజ్వేంద్ర చాహ‌ల్ , అక్ష‌ర్ ప‌టేల్ , బిష్ణోయ్ , భువీ, హ‌ర్ష‌ల్ , అవేష్ ఖాన్ , అర్ష దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

Also Read : శ్రీ‌లంక‌తో వ‌న్డే సీరీస్ కు ఆసిస్ జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!