IND vs ZIM 3rd ODI : ఉత్కంఠ భ‌రిత పోరులో భార‌త్ హ‌వా

పోరాడి ఓడి పోయిన జింబాబ్వే జ‌ట్టు

IND vs ZIM 3rd ODI : ఆతిథ్య జింబాబ్వే జ‌ట్టు భార‌త్ తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో విజ‌యం కోసం చివ‌రి వ‌ర‌కు పోరాడింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. అయినా టీమిండియా ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

మూడు వ‌న్డేల సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మొద‌టి వ‌న్డేలో 10 వికెట్ల తేడాతో గెలుపొందితే రెండో వ‌న్డే మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విక్ట‌రీ న‌మోదు చేసింది. ఇక కీల‌క‌మైన మూడో వ‌న్డే మ్యాచ్ లో(IND vs ZIM 3rd ODI) సైతం భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది.

త‌న‌కు ఎదురే లేద‌ని చాటి చెప్పింది. హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఈ ఉత్కంఠ భ‌రిత పోరులో అదృష్టం భారత్ తలుపు త‌ట్టింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. జింబాబ్వే జ‌ట్టులో సికంద‌ర్ ర‌జా అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఏకంగా సెంచ‌రీ చేసి త‌న జ‌ట్టును గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చాడు. కానీ అనూహ్యంగా జింబాబ్వే మ్యాచ్ ను పోగొట్టుకుంది. ఆఖ‌రులో మ‌రింత టెన్ష‌న్ నెల‌కొంది.

9 బంతుల్లో 15 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. ఈ త‌రుణంలో కీల‌క ఇన్నింగ్స్ ఆడుతున్న సికింద‌ర్ రాజా ఔట్ అయ్యాడు. 290 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవ‌ర్ల‌లో 276 ప‌రుగుల‌కు చాప చుట్టేసింది.

దీంతో టీమిండియా చేతిలో 13 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ర‌జా 115 రన్స్ చేస్తే విలియ‌మ్స్ 45 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 289 ర‌న్స్ చేసింది.

శుభ్ మ‌న్ గిల్ 130 ర‌న్స్ చేసి దుమ్ము రేపాడు. కిష‌న్ 50, ధావ‌న్ 40 ప‌రుగుల‌తో రాణించారు.

Also Read : వారెవ్వా సికింద‌ర్ ర‌జా

Leave A Reply

Your Email Id will not be published!