S Jai Shankar : ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భారత్ – జై శంక‌ర్

భార‌త్, సౌదీ అరేబియా మ‌ధ్య బంధం

S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం రాబోయే కాలంలో ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు .

ఆ దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని చెప్పారు. కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో తాము విజ‌య‌వంతం అయ్యామ‌ని తెలిపారు జై శంక‌ర్. సౌదీ అరేబియాలో మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.

ఇందులో భాగంగా భార‌త్, సౌదీ అరేబియా దేశాల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షించారు. ఇదిలా ఉండ‌గా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎస్ జైశంక‌ర్ సౌదీ అరేబియాకు వెళ్లడం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్స్ చేస్తూ ..భార‌త్ త‌న ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్దికి , అధిక ఆదాయ దేశంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌న్నారు.

ఈ ఏడాది క‌నీసం 7 శాతంతో ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రిస్తుంద‌న్నారు కేంద్ర మంత్రి. ఉక్రెయిన్ సంక్షోభం ద్వారా ఎదుర‌యే స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని చెప్పారు.

సౌదీ అరేబియా సైతం భార‌త్ తో ఎల్ల‌వేళ‌లా సంబంధ బాంధ‌వ్యాల‌ను కోరుకోవ‌డం త‌న‌కు ఆనందం క‌లిగించింద‌ని పేర్కొన్నారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) .

సౌదీలో భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు కేంద్ర మంత్రి. భార‌త దేశం ప్ర‌ధానంగా క్రెడిట్ బ్యాంకింగ్ , విద్య‌, కార్మిక విధానాన్ని మార్చ గ‌ల మార్గాల గురించి ఆలోచిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

వ‌స్తువుల వ్యాపారం 400 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోదైంద‌ని చెప్పారు.

Also Read : పెద్ద‌న్న‌లా ప్రోత్స‌హించారు – చిరంజీవి

Leave A Reply

Your Email Id will not be published!