Piyush Goyal : స‌మిష్టి కృషితో ఆర్థిక శ‌క్తిగా భార‌త్

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్

Piyush Goyal : స‌మిష్టి కృషితో భార‌త దేశం ప్ర‌పంచ ఆర్థిక శ‌క్తిగా మారుతుంద‌ని జోష్యం చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్. నిరంత‌ర ప్ర‌య‌త్నాల‌తో వ‌చ్చే 25 ఏళ్ల‌లో అంటే 2047 నాటికి మ‌నకు స్వాతంత్రం ల‌భించి 100 ఏళ్లు పూర్త‌వుతుంద‌న్నారు.

ప్ర‌స్తుతం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ 3.5 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి. ఏపీలోని కాకినాడ‌లో ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రారంభోత్స‌వానికి పీయూష్ గోయ‌ల్(Piyush Goyal) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

భ‌విష్య‌త్తులో భార‌త వాణిజ్యం మ‌రింత అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే త‌ప్ప‌నిస‌రిగా మాన‌వ వ‌న‌రుల నిపుణుల నిర్వ‌హ‌ణ అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు పీయూష్ గోయ‌ల్. ప్ర‌త్యేకించి మాన‌వ వ‌న‌రుల‌ను ఐఐఎఫ్టీల ద్వారా అందుబాటులోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

ఈ కొత్త క్యాంప‌స్ ఏర్పాటు కొత్త అధ్య‌యనానికి నాంది ప‌లుకుతుంద‌న్నారు. రాజ‌కీయ స్థిర‌త్వం, అధిక పోటీతత్వం , స‌మిష్టి కృషి , అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్య‌వస్థ‌తో భార‌త్ ప్ర‌పంచంలోనే ఆర్థిక శ‌క్తిగా మారుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.

నిపుణులైన మాన‌వ వ‌న‌రుల‌ను గ‌రిష్ట స్థాయిలో అందుబాటులో ఉంచిన‌ట్ల‌యితే అభివృద్దికి ఢోకా అన్న‌ది ఉండ‌ద‌న్నారు. ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ కింద కేంద్ర స‌ర్కార్ చేప‌డుతున్న చ‌ర్య‌లు, బ‌డ్జెట్ ప్ర‌త్యేక కేటాయింపులు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థను ప‌టిష్టంగా సుసంన్నం చేస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్(Piyush Goyal).

వ్య‌వ‌సాయం, మ‌త్స్య వంటి రంగాల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతోంద‌న్నారు.

Also Read : కాలుష్య వ్య‌తిరేక‌ ప్ర‌చారంపై చెరో దారి

Leave A Reply

Your Email Id will not be published!