IND vs ENG 2nd T20 : రీ షెడ్యూల్ ఆఖరి 5వ టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు(IND vs ENG 2nd T20). టి20 సీరీస్ లో భాగంగా రెండో టి20 మ్యాచ్ లోనూ సత్తా చాటింది. ఘన విజయాన్ని నమోదు చేసింది.
కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జాస్ బట్లర్ కు ఇది ఒక రకంగా షాక్. గతంలో వైస్ కెప్టెన్ గా ఉన్న బట్లర్ ను ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఏరికోరి జాస్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత జట్టు బౌలర్లు ఈ మ్యాచ్ లోనూ రెచ్చి పోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు పరుగులు తీయకుండా. దీంతో ఆతిథ్య జట్టుపై 49 రన్స్ తేడాతో విక్టరీ సాధించారు.
భువనేశ్వర్ కుమార్ , జస్ ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంకో మ్యాచ్ ఉండగానే సీరీస్ చేజిక్కించుకుంది.
భువీ 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే బుమ్రా 10 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఇక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 10 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంతకు ముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది
8 వికెట్లు కోల్పోయి. జడేజా 29 బంతులు ఆడి 5 ఫోర్లతో 46 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతులు ఆడి 2 సిక్సర్లు 3 ఫోర్లతో 31 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ దుమ్ము రేపాడు. కేవలం
27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 17 ఓవర్లలో కుప్ప కూలింది 121 పరుగులకే. మొయిన్ అలీ 35 రన్స్ చేస్తే విల్లే 33 రన్స్ చేసి
నాటౌట్ గా నిలిచారు. ఎప్పటి లాగే ఒక్క పరుగుకే వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ.
Also Read : కోహ్లీ ఆట తీరు మెరుగు పర్చుకోవాలి