India Win : భారత జట్టు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో మూడు వన్డేల సీరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది.
మొదటి, రెండో వన్డేలలో ఓటమి పాలైన విండీస్ ఎలాగైనా సరే ఆఖరి మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపు కోవాలని ఆశించినా దక్కలేదు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన సీరీస్ ఇదే.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా(India Win) 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన విండీస్ టీమ్ 37.1 ఓవర్లలో 169 పరుగులే చేయగలిగారు.
భారత జట్టు బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఆటగాళ్లు రన్స్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. విచిత్రం ఏమిటంటే ప్రత్యర్థి టీం 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి ఇక ఓటమి ఖాయమని అనుకున్న సమయంలో టెయిలెండర్లు అడ్డుకున్నారు.
జోసెఫ్ 29 పరుగులు స్మిత్ 36 పరుగులు చేసి చివరి వరకు లాక్కు వచ్చారు. దీంతో విండీస్ ఓ సమయంలో విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ ప్రసిద్ద్ కృష్ణ జోసెఫ్ ను అవుట్ చేస్తే సిరాజ్ స్మిత్ , వాల్ష్ ను సిరాజ్ పెవిలియన్ పంపించాడు.
దీంతో విండీస్ పోరాటం ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్, కృష్ణ (India Win)మూడు వికెట్ల చొప్పున తీశారు. చాహర్, యాదవ్ చెరో రెండు వికట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది లోనే వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 80 , పంత్ 56 పరుగులు చేసి రాణించారు. దీంతో స్కోర్ పరుగులు తీసింది.
Also Read : క్లీన్ స్విప్ చేస్తారా చేతులెత్తేస్తారా