INDW vs PAKW : ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ రసకందాయంగా మారింది. భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్ లో భాగంగా వార్మప్ మ్యాచ్ లలో విజయం సాధించి ఊపు మీదున్న భారత్ (INDW vs PAKW )పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. కానీ భారీ స్కోర్ సాధించడంలో సక్సెస్ అయ్యింది.
ఏకంగా 245 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది. టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జవేరియా ఖాన్ రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో జులన్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
దీంతో పాకిస్తాన్ మహిళా ఆటగాళ్లు నానా తంటలు పడుతున్నారు పరుగులు చేసింది. అంతకు ముందు భారత జట్టు బ్యాటింగ్ లో పూజా చెలరేగింది. పాకిస్తాన్ బౌలర్ల భరతం పట్టింది.
వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇక్కట్లలో ఉన్న భారత్ ను పూజా వస్త్రాకర్ , స్నేహ్ రాణా ఆదుకున్నారు.
వీరిద్దరూ కలిసి 7వ వికెట్ కు ఏకంగా 124 పరుగులు చేశారు. పూజా 67 పరుగులు చేస్తే రాణా 53 పరుగులు చేసింది. మిథాలీ 9 , ప్రీత్ 5, షఫాలీ సున్నాకే అవుటయ్యారు.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో నిదా ధార్, సంధు చెరో రెండు వికెట్లు తీశారు. బేగ్, అమీన్ ఒక్కో వికెట్ సాధించారు.
Also Read : జర్నలిస్ట్ పేరు చెప్పేశాడు