INDW vs SAW : ఉత్కంఠ పోరులో స‌ఫారీ విక్ట‌రీ

ఇండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు

INDW vs SAW : భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో సుదీర్ఘ అధ్యాయానికి ఇవాల్టితో తెర ప‌డింది. ప్ర‌పంచ మ‌హిళా క్రికెట్ లో ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక మ‌హిళా క్రికెట‌ర్ గా పేరొందారు హైద‌రాబాద్ కు చెందిన మిథాలీ రాజ్.

త‌న చిర‌కాల కోరిక వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు రావాల‌ని. కానీ అది నెర‌వేర‌లేదు. న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో సెమీ ఫైన‌ల్ కోసం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు(INDW vs SAW) 3 వికెట్ల తేడాతో ఓడి పోయింది.

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఈ మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. థ్రిల్లింగ్ ను క‌లుగ చేసిన ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండ‌గా మిథాలీ రాజ్ కు ఇదే ఆఖ‌రి మ్యాచ్ .

ఒక‌వేళ గెలిచి ఉంటే భార‌త అభిమానులు ఆనందం చెందేవారు. కానీ భార‌త జ‌ట్టు చివ‌రి వ‌ర‌కు పోరాడింది. ఈ మ్యాచ్ లో మిథాలీ రాజ్ తో పాటు స్మృతీ మంధాన సైతం స‌త్తా చాటింది.

7 వికెట్లు కోల్పోయి 274 ప‌రుగులు చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది భారీ స్కోర్. సౌతాఫ్రికా జ‌ట్టు చివ‌రి దాకా పోరాడింది. ఊహించ‌ని రీతిలో స‌త్తా చాటింది. ఆ జ‌ట్టు కూడా 275 ప‌రుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.

ఎట్ట‌కేల‌కు భార‌త్ విజ‌యం సాధించ‌డంలో విఫ‌ల‌మైంది. ఇదిలా ఉండ‌గా ఆఖ‌రు బంతి వ‌ర‌కు ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై తీవ్ర టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌ర‌కు విజ‌యం స‌ఫారీ వైపు నిలిచింది.

దీంతో సుదీర్ఘ క‌ల‌ను నెర‌వేర్చు కోకుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది భార‌త జ‌ట్టు. ఏది ఏమైనా మిథాలీ సేన క‌న‌బ‌ర్చిన పోరాట ప‌టిమ గొప్ప‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : దేశం గ‌ర్వ ప‌డేలా ఆడారు

Leave A Reply

Your Email Id will not be published!