India Test Team Squad : ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్..ఇండియా స్క్వాడ్ వేరే
ప్లేయర్ల ఎంపికపై గంభీర్ ప్రభావం ఈసారి అధికంగా ఉంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి...
India Test Team Squad : క్రికెట్ దిగ్గజాలు రోహిత్, విరాట్ టెస్టుల నుంచి తప్పుకోవడంతో వారి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. భారత టెస్టు క్రికెట్ ఓ కీలక దశకు చేరుకుంది.ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో మార్గదర్శిగా నిలుస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత కోచ్ గౌతమ్ గంభీర్ పైనే ఉంది. ప్లేయర్ల ఎంపికపై గంభీర్ ప్రభావం ఈసారి అధికంగా ఉంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
India Test Team Squad Details
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌కు ఓపెనింగ్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాహుల్‌కు ఇంగ్లండ్‌పై ఓపెనర్‌గా బరిలోకి దిగిన అనుభవం కూడా ఉంది.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో కుదురుకున్నాడు. అయితే, విరాట్ స్థానంలో అతడిని నాలుగో ప్లేయర్‌గా దింపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. దూకుడుతో పాటు బాల్‌పై నియంత్రణ కలిగిన శుభ్‌మన్ టెస్టుల్లో మేటి ప్లేయర్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ కొనసాగే ఛాన్స్ ఉంది. పంత్ స్థానంలో దిగేందుకు బ్యాకప్‌గా ధ్రువ్ పటేల్ అందుబాటులో ఉండొచ్చు. స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఎంపికవుతాడా లేక వాషింగ్టన్ సుందర్ ఎంపికవుతాడా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సుందర్ వైపు గంభీర్ మొగ్గు చూపొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ ఇంగ్లండ్ టూర్లో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ దక్కకపోవచ్చు.
టీమిండియా(India) ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అకాశ్ దీప్ వంటి వారు పోటీపడుతున్నారు. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌కు పేస్ బౌలర్లు కీలకం కానున్నారు. 2021 నాటి ఇంగ్లండ్ టూర్లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని పేస్ బౌలర్లు ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించారు. ఈసారీ ఆ దూకుడును కనబరచగలగడం టీమిండియా ముందున్న ప్రధాన సవాలు. ఇక ఫిట్నెస్ కారణంగా ముహమ్మద్ షమీ ఈసారి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
యశశ్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అకాశ్ దీప్
అభిన్యూ ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, కరణ్ నాయర్, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్
ఇండియా(India) ఏ కెప్టెన్ అభిమన్యూ ఈశ్వరన్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉండనున్నారు. కరణ్ నాయర్‌కు ఛాన్స్ దక్కొచ్చు. రెండో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాలను ఫాస్ట్ బౌలర్లు హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్‌తో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Bharat Slams Pakistan : ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భగ్గుమన్న భారత్