IND vs SL 1st Test : భారత్ తో మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఫాలో ఆన్ ఆడుతున్న ఈ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 574 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 96 పరుగులు చేస్తే రవీంద్ర జడేజా 175 పరుగులు చేసి దుమ్ము రేపారు.
లంకేయులకు చుక్కలు చూపించారు. హనుమ విహారీ 58 పరుగులు చేస్తే కోహ్లీ(IND vs SL 1st Test) 45 రన్స్ చేశారు. ఇక టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే చాప చుట్టేసింది.
ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దిముత్ కరుణ రత్నే 27 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో పంత్ కు క్యాచ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో శ్రీలంక 45 పరుగుల వద్ద మూడో వికెట్ పారేసుకుంది. ఇక భారత్ ఇంకా విజయం సాధించాలంటే 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఫాలో ఆన్ ఆడుతున్న లంక ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటిన పాతుమ్ నిస్సంకా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
నిస్సంకా వికెట్ తీసిన అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అశ్విన్ కు 434 వ వికెట్. దీంతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచాడు.
Also Read : చెలరేగిన భారత్ తలవంచిన పాకిస్తాన్