India Tightens Gold : ప‌సిడి ప్రియుల‌కు భారీ షాక్

ఆభ‌ర‌ణాల దిగుమ‌తులు క‌ఠిన‌త‌రం

India Tightens Gold : ఓ వైపు బంగారం ధ‌ర‌లు పైపైకి పోతున్నాయి. అయినా ప‌సిడి ప్రియులు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆషాఢంలో భారీ ఎత్తున కొనుగోలు చేశారు. తులం ధ‌ర క‌నీసం 59 వేలు ఉండేది నిన్న‌టి దాకా కానీ ఇవాళ 61 వేల‌కు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఇంకెంత ధ‌ర ప‌లుకుతుందోన‌ని గోల్డ్ ప్రియులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఆభ‌ర‌ణాల ప్రియుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది మోదీ ప్ర‌భుత్వం . బంగారు ఆభ‌ర‌ణాల దిగుమ‌తుల‌పై భార‌త్ నియంత్ర‌ణ‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది(India Tightens Gold). సాధార‌ణ బంగారు ఆభ‌ర‌ణాల దిగుమ‌తి ఇప్పుడు ఉచిత కేట‌గిరీ నుండి ప‌ర‌మిత కేట‌గిరీకి మార్చింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా ప‌సిడి దిగుమ‌తుల‌పై భార‌త దేశం 15 శాతం ప‌న్ను విధిస్తుంది. కాగా దీంట్లో ఉన్న లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని పెద్ద ఎత్తున బంగారాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

క‌స్ట‌మ్స్ శాఖ విభాగం కూడా జ‌ల్లెడ ప‌ట్టింది. దీనికి ప‌రిష్కారం క‌నుగొనే దిశ‌గా అడుగులు వేసింది కేంద్ర స‌ర్కార్. వాణిజ్య విధానాన్ని ప‌రిష్క‌రించేందుకు గాను ప‌రిశ్ర‌మ‌, వాణిజ్య మంత్రిత్వ శాఖ‌కు బ‌ద‌లాయించింది. ఎక్కువ‌గా బంగారాన్ని, ఆభ‌రణాల‌ను ఇండోనేషియా నుండి ఇండియాకు తీసుకు వ‌స్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. భార‌త దేశం – యూఏఈ సీఇపీఏ ఒప్పందం కింద దిగుమ‌తులు అయితే లైసెన్సింగ్ అవ‌స‌రాల నుండి మిన‌హాయించ‌బ‌డ్డాయి.

Also Read : AR Rahman Ram Charan : చెర్రీ మూవీకి అల్ల‌రఖా మ్యూజిక్

Leave A Reply

Your Email Id will not be published!