Kurt Campbell : పసిఫిక్ దీవులపై భారత్..యుఎస్ ఫోకస్
బైడెన్ డిప్యూటీ అసిస్టెంట్ కర్ట్ కాంప్ బెల్
Kurt Campbell : అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ డిప్యూటీ అసిస్టెంట్ కర్ట్ కాంప్ బెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పసిఫిక్ దీవులపై భారత్, అమెరికా దేశాలు ఫోకస్ పట్టాయని వెల్లడించారు.
కాగా జాతీయ భద్రతా మండలిలో క్వాడ్ , హిందూ మహా సముద్ర ద్వీప రాష్ట్రాల పట్ల అమెరికా నుండి వ్యూహాత్మక విధానం లేక పోవడం అని అంగీకరించాడు కర్ట్ కాంప్ బెల్(Kurt Campbell) .
పసిఫిక్ దీవుల్లో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై అమెరికా, భారత్ లు పరస్పరం చర్చిస్తున్నాయని వైట్ హౌస్ ఇండో పసిఫిక్ కో ఆర్డినేటర్ కర్ట్ కాంప్ బెల్ పేర్కొన్నారు.
భారత్ తో సత్ సంబంధాలు కొనసాగించడం తమకు లాభించే విషయమని తెలిపారు. క్వాడ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు కార్ట్ కాంప్ బెల్. పసిఫిక్ దీవుల మాదిరిగానే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
దానిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. యుఎస్ ప్రాంతంలో వ్యూహాత్మక, నైతిక, రాజకీయ, మానవతా ప్రయోజనాలను కలిగి ఉందన్నారు కర్ట్ కాంప్ బెల్(Kurt Campbell).
అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే పసిఫిక్ దీవులలో పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాదనలేని వ్యూహాత్మక భాగం ఉందన్నారు.
అమెరికా ఈ ప్రాంతంపై ఉండాల్సిన దాని కంటే తక్కువ శ్రద్ద చూపిందన్న వాస్తవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ గురువారం న్యూయార్క్ లో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
వచ్చే వారం వైట్ హౌస్ లో మొదటిసారిగా పసిఫిక్ ద్వీప దేశాల నాయకులకు ఆతిథ్యం ఇస్తున్నారు.
Also Read : రష్యాను ఒప్పించాలంటే మోదీనే బెటర్