India vs Canada : జీ7 సమ్మిట్ తో మోదీని కలిసి స్వరం మార్చిన ‘జస్టిన్ ట్రూడో’
కాగా, ప్రధాని ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను ప్రధాని మోదీ షేర్ చేశారు...
India vs Canada : గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ట్రూడో కొన్ని సార్లు భారత వ్యతిరేక వైఖరిని అవలంబించారు. అయితే… ఇప్పుడు ఆయన స్వరం మారింది. తన అహంకారాన్ని పక్కనబెట్టి భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నానని మహత్తర ప్రకటన చేశారు. జీ7 సమావేశంలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఆయనలో ఈ మార్పు వచ్చింది. “అయితే… భారత్‌తో ముఖ్యమైన పనులు చేయాలని మేము నిశ్చయించుకున్నాము.
India vs Canada…
భవిష్యత్తులో, మేము కొన్ని ముఖ్యమైన సమస్యలు మరియు పనులను కలిసి పరిష్కరించుకుంటాము” అని ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ(PM Modi)ని కలిసిన తర్వాత ట్రూడో చెప్పారు. అదే సమయంలో భారత ప్రధానిగా మళ్లీ ఎన్నికైనందుకు మోదీకి ట్రూడో ధన్యవాదాలు తెలిపారని, ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలపై క్లుప్తంగా చర్చించుకున్నారని కెనడా ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రధాని ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను ప్రధాని మోదీ షేర్ చేశారు.
గత సెప్టెంబరులో, G20 శిఖరాగ్ర సమావేశం ముగిసిన వారం తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో నేరుగా నిజ్జార్ హత్యకు భారతదేశాన్ని నిందించారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసిన ఈ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ట్రూడో వాదనలను భారత్ వేగంగా తిరస్కరించింది. ఆరోపణలకు ఆధారాలు అందజేస్తే చర్యలు తీసుకుంటామని భారత్ తెలిపింది. అయితే కెనడా నుంచి సరైన స్పందన రాలేదు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి.. భారత్‌తో కలిసి పని చేస్తానని ప్రధాని ట్రూడో ప్రకటించగానే ఈ సమస్య ముగుస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
Also Read : World War III : మరో 48 గంటల్లో మూడవ ప్రపంచ యుద్ధం…?