India WI Tour : భారత్ విండీస్ టూర్ షెడ్యూల్
వన్డేలు, టి20 మ్యాచ్ లకు జట్లు
India WI Tour : ఇంగ్లండ్ టూర్ ను విజయవంతంగా ముగించుకొన్న భారత జట్టు వెస్టిండీస్(India WI Tour) లో పర్యటించేందుకు సిద్దమైంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షెడ్యూల్ ను ఖరారు చేసింది.
విండీస్ టూర్ లో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. వన్డే సీరీస్ కోసం రోహిత్ శర్మను పక్కన పెట్టారు. అతడి స్థానంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.
టి20 సీరీస్ కు రోహిత్ కు పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందు కోసం బీసీసీఐ సెలెక్టర్లు
ప్రయోగాలు చేస్తున్నారు. అసలు చివరి వరకు ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి నెలకొంది.
జట్ల పరంగా చూస్తే వన్డే సీరీస్ కు భారత జట్టు(India WI Tour) కెప్టెన్ శిఖర్ ధావన్ కాగా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.
జట్టులో రుతురాజ్ , శుభ్ మన్ , దీపక్ హూడా, సూర్య కుమార్ , శ్రేయస్ అయ్యర్ , ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ , శార్దూల్ ఠాకూర్ , యుజువేంద్ర
చాహల్ , అక్షర్ పటేల్ , ఆవేశ్ ఖాన్ , ప్రసిద్ద్ కృష్ణ , సిరాజ్ , ఆర్ష దీప్ ఉన్నారు.
ఇక టి20 సీరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ . ఇషాన్ కిషన్ , కేఎల్ రాహుల్ , సూర్య కుమార్ , దీపక్ హూడా, అయ్యర్, దినేశ్ కార్తీక్ , రిషబ్ పంత్ ,
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , ఆర్. అశ్విన్ , రవి బిష్ణోయ్ , కుల్దీప్ యాదవ్ , భువీ , ఆవేష్ ఖాన్ , హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ ఆడతారు.
ఇక విండీస్ బోర్డు తన జట్టును ప్రకటించింది. పూరన్ కెప్టెన్ కాగా షాయో హోప్ వైస్ కెప్టెన్ , బ్రూక్స్, కార్టీ, జాసన్ హోల్డర్ , హూసేన్ ,
జోసెఫ్ , కింగ్ , మేయర్స్ , మోటత, కిమో పాల్ , రోవ్ మన్ పావెల్ , సీల్స్ ఆడతారు.
Also Read : వన్డే ర్యాంకింగ్స్ లో బాబర్..బౌల్ట్ టాప్
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022